యోగము అంటే ఏమిటి?
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు[1].
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు) [2].
యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
సంస్కృతం తెలుగు ఇంగ్లీషు
अधोमुख स्वानासन అధోముఖ స్వానాసనం Downward-Facing Dog Pose
अधोमुख वृक्षासन అధోముఖ వృక్షాసనం Handstand (Downward-Facing Tree)
अंजलि मुद्रा అంజలి ముద్ర Salutation Seal
अर्ध चन्द्रासन అర్ధ చంద్రాసనం Half Moon Pose
अर्ध मत्स्येन्द्रासन అర్థ మత్సేంద్రాసనం Half Spinal Twist
बद्ध कोणसन బద్ధ కోణాసనం Bound Angle
बकासन బకాసనం Crane Pose
बालासन బాలాసనం Child's Pose (relaxation)
भरद्वाजसन భరద్వాజాసనం Bharadvaja's Twist
भुजङ्गासन భుజంగాసనం Cobra Pose
चक्रासन చక్రాసనం Wheel Pose
चतुरङ्ग दण्डासन చతురంగ దండాసనం Four-Limbed Staff
दण्डासन దండాసనం Staff pose
धनुरासन ధనురాసనం Bow
एक पाद रजकपोतासन ఏకపాద రాజకపోతాసనం One-Legged King Pigeon
गरुडासन గరుడాసనం Eagle Pose
गोमुखासन గోముఖాసనం Cow Face
हलासन హలాసనం Plough Pose
हनुमनासन హనుమానాసనం Hanuman Pose
जानु शिरासन జాను శిరాసనం Head-to-Knee Forward Bend
काकासन కాకాసనం Crow Pose
क्रौन्चासन క్రౌంచాసనం Heron
कुक्कुटासन కుక్కుటాసనం Cock Posel
कूर्मासन కూర్మాసనం Tortoise Pose
मकरासन మకరాసనం Crocodile Pose(relaxation)
मत्स्यासन మత్స్యాసనం Fish Pose
मत्स्येन्द्रासन మత్స్యేంద్రాసనం Lord of the Fishes (named after Matsyendra)
मयूरासन మయూరాసనం Peacock Pose
नटराजासन నటరాజాసనం Lord of the Dance
पाद हस्थासन పాద హస్తాసనం Standing Forward Bend
पद्मासन పద్మాసనం Lotus Pose
परिपूर्ण नवासन పరిపూర్ణ నావాసనం Full Boat Pose
परिवृत्त पार्श्वकोणासन పరివృత్త పార్శ్వకోణాసనం Revolved Side Angle
परिवृत्त त्रिकोणासन పరివృత్త త్రికోణాసనం Revolved Triangle
पाशासन పాశాసనం Noose
पश्चिमोत्तानासन పశ్చిమోత్తానాసనం Posterior Stretch in Forward Bend
प्रसरित पादोत्तानसन ప్రసరిత పాదోత్తానాసనం Intense Spread Leg Stretch
शलभासन శలభాసనం Locust Pose
सर्वाङ्गासन సర్వాంగాసనం Shoulder Stand
शवासन శవాసనం Corpse Pose (relaxation)
सेतु बन्ध सर्वाङ्गासन సేతుబంధ సర్వాంగాసనం Bridge, Half Wheel
सिद्धासन సిద్ధాసనం Perfect Pose
सिंहासन సింహాసనం Lion
शीर्षासन శీర్షాసనం Head Stand
सुखासन సుఖాసనం Auspicious Pose
सुप्त बद्ध कोणासन సుప్తబద్ధ కోణాసనం Reclining num) Bound Angle
सुप्त पादाङ्गुष्टासन సుప్త పాదాంగుష్టాసనం Reclining numb Big Toe
सुप्त वीरासन సుప్త వీరాసనం Reclining Hero
स्वस्तिकासन స్వస్తికాసనం Prosperous Pose
ताडासन తాడాసనం Mountain Pose
त्रिकोणासन త్రికోణాసనం Triangle Pose
उपविष्ट कोणासन ఉపవిష్ట కోణాసనం Open Angle
ऊर्ध्व धनुरासन ఊర్ధ్వ ధనురాసనం Upward Bow, Backbend, or Wheel
ऊर्ध्व मुख स्वानासन ఊర్ధ్వముఖస్వానాసనం Upward-Facing Dog
उष्ट्रासन ఉష్ట్రాసనం Camel
उत्तान कूर्मासन ఉత్తాన కూర్మాసనం Upside-Down Tortoise
उत्कटासन ఉత్కటాసనం Chair
उत्तानसन ఉత్తానాసనం Standing Forward Bend
उत्थित हस्त पादाङ्गुष्टासन ఉత్థితహస్త పాదంగుష్టాసనం Raised Hand to Big Toe
उत्थित पार्श्वकोणासन ఉత్థిత పార్శ్వకోణాసనం Extended Side Angle
उत्थित त्रिकोणासन ఉత్థిత త్రికోణాసనం Extended Triangle
वसिष्टासन వశిష్టాసనం Side Plank
विपरित करणी విపరీత కరణి Legs-up-the-Wall
वज्रासन వజ్రాసనం Thunderbolt
वीरासन వీరాసనం Hero
वृक्षासन వృక్షాసనం Tree Pose
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి ప్రమానంద స్తితిని సాధించడము దీనిలో వివరించబడింది.
సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము
1.యమ
అహింస హింసను విడనాడటము.
సత్యము సత్యము మాత్రమే పలకటము.
అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2.నియమ
శౌచ శుభ్రము.
సంతోష ఆనందంగా ఉండటము.
తపస్య తపస్సు.
స్వధ్యాయన అంతర్దృష్ఠి.
ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3.ఆసన
4.ప్రాణాయామ
5.ప్రత్యాహార
6.ధారణ
7.ధ్యానము
8.సమాధి
ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా ఉన్నఆద్ధ్యాత్మిక భావం కారణంగా దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ముఖ్యముగా పాశ్చాత్యదేశాల యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. పాశ్చాత్య దేశీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. బుద్ధ ఆరామలాలో ఇచ్చేశిక్షణలో యోగా కూడా ఒక భాగమే. వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో కూడా అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది.