Search This Blog

Chodavaramnet Followers

Tuesday 14 October 2014

SOME TELUGU CULTURAL TIPS


మన పూర్వికులు, మన సంప్రదాయకర్త లైన మన ఋషీశ్వరులు చెప్పిన ఒక మంచి పనిని చేయటం చాలా చాలా కష్ట మనుకోండి. మనకు చేతనైతే చేస్తాం. లేకపోతే లేదు. ఆ మంచి పనిని చేయటం చాలా చాలా సులభ మనుకోండి. చేయవచ్చును కదా! చేయటానికి అభ్యంతర మేమీ ఉండనవసరం లేదు కదా! ఈ క్రింది విషయాన్ని చూడండి.
మనం ఉదయమే ముఖం కడుక్కొని నీటిని పుక్కిలించి ఉమ్మివేస్తాం. లేదూ ఇంకా అనేక సందర్భాలలో నీటిని పుక్కిలించి ఉమ్మివేస్తాం. కదా! ఎటువైపు తిరిగి ఉమ్మి వేయాలి? అని ప్రశ్న.
శ్లో!! పురత స్సర్వ దేవాశ్చ, దక్షిణే పితర స్తథా !!
ఋషయ: పృష్ఠత స్సర్వే, వామే గండూష ముత్సృజేత్ !!

భావము :
మనం ఎక్కడ, ఎటువైపు, ఏ దిక్కుకు తిరిగి నిలబడినప్పటికీ మనకు ఎదురుగా సకల దేవత లుంటారు. కుడి వైపున పితృ దేవత లుంటారు. వెనుక వైపున ఋషీశ్వరు లుంటారు. కనుక ఎడమ వైపున మాత్రమే పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇది పద్ధతి.