Search This Blog

Chodavaramnet Followers

Sunday, 14 September 2014

LORE SRIKRISHNA PURANA POEMS


శ్రీ కృష్ణుని మరణము

ద్వారకా నగరం నుంచి దుఖంతో తిరిగి వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు శ్రీకృష్ణ ,బలరామాదుల క్షేమం అడుగుతూ సంధించిన ప్రశ్నల పరంపర లలో కొన్ని .. -దైన్యం చెందవలసిన సందర్భాలను అన్నిటిని ఓ పట్టిక తయారు చేసినట్టు గా పోతనగారు తెలియచేసారు .

ఓడితివో శత్రువులకు
నాడితివో సాదు దూషనాలాపములన్
గూడితివో పరసతులను
వీడితివో మానధనము వీరుల నడుమన్

తప్పితివో ఇచ్చెదనని
చెప్పితివో కపటసాక్షి ! చేసిన మేలుం
దెప్పితివో ! శరణార్థుల
రొప్పితివో ద్విజుల ,బసుల ,రోగుల సతులన్

అడిచితివో భూసురులను
గుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను ;
ముడిచితివో పరుల విత్తములు లోభమ్మునన్

అర్జునుని లోకోత్తరమైన సమాధానం

మన సారథి ,మన సచివుడు
మన వియ్యము , మన సఖుండు , మన బాంధవుడు న్
మన విభుడు ,గురుడు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా !