Search This Blog

Chodavaramnet Followers

Sunday, 14 September 2014

LORD BRAHMA AT BRUNDAVANAM - SRIKRISHNA SATAKAM POEMS IN TELUGU


బృందావనమున బ్రహ్మ

కృష్ణ శతకము

బృందావనమున బ్రహ్మ
నందార్బకమూర్తి వేణు నాదము నీ వా
మందార మూలమున గో
విందా పూరింతువౌర వేడుక కృష్ణా!

కృష్ణా!బ్రహ్మానందము కలిగించెడి బాలకుని రూపమున నీవు బృందావనములో మందార వృక్షము మొదట గూర్చుండి ఎంతో వేడుక పుట్టునట్లు ఆశ్చర్యముగా పిల్లనగ్రోవిని ఊదెదవు.
పదియాఱువేల నూర్వురు
సుదతులు యొనమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విడితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా!

కృష్ణా!ఈ భూలోకములో అవతరించినప్పుడు నీకు పదహారువేల నూఱుగురు గోపికలును,నెనమండ్రు పట్టపురాణులను కలరు.వీరిని అందరును అనేక రూపములు దరించి నీవు తృప్తిపఱచుదువు.నీమహిమ అద్బుతము కదా!