శివలింగము ముందు నంది ఉండటములో అర్థము
శివాలయములో శివలింగానికి ఎదురుగా ఉంచే నందియొక్క గూఢార్థము యోగములో అష్టాంగయోగమే. నందియొక్క మేరుదండము నిఠారుగా ఉండును. నందియొక్క రెండు కొమ్ములు ఇడ మరియు పింగళ సూక్ష్మ నాడుల ప్రతీకలు. ఆ నందియొక్క రెండు కొమ్ముల మధ్యలో నిఠారుగా ఉన్న మేరుదండము సుషుమ్న సూక్ష్మ నాడియొక్క ప్రతీక. శివలింగము సహస్రారచక్రమునకు ప్రతీక. ముడ్డి దగ్గర ఒక చేత్తో రాస్తూ, నందియొక్క రెండు కొమ్ముల మధ్య నుండి చూడటము అంటే, సాధనచేసి ముడ్డిదగ్గర మూలధారచక్రములో ఉన్న కుండలిని ప్రాణశక్తిని వెచ్చబరిచి, ఆ కుండలిని ప్రాణశక్తిని నిఠారుగా ఉన్న మేరుదండములోని సుషుమ్నద్వారా సహస్రార చక్రములోనికి పంపమని సూచన
అంటే మూలాదారచక్రము నందు ఉన్న ప్రాణశక్తి(జీవాత్మ)
సహస్రారచక్రము నందు ఉన్న పరమాత్మ(శివుడు)ని చేరడమే