శ్రీ వల్లభ మహా గణపతి చరిత్ర
శ్రీ వల్లభ మహా గణపతి చరిత్ర శ్రీ వల్లభ గణపతి ఎలా పుట్టారు? :
పూర్వం గజసరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా శక్తిమంతుడు. వాడు దేవతలను, ఋషులను పీడెంచేవాడు. వాడిని చంపటం 33 కోట్ల మండి దేవతల ఎవరి వల్ల కాలేదు. వాడి బాధలు పడలేక దేవథ్లందారు కైలాసం వచ్చి పార్వతి పరమేశ్వరులకు తమ బాధ చెప్పుకున్నారు. పార్వతి అమ్మవారిని చూసి శివుడు నావ్వడు. అమ్మవారు శివుణ్ణి చూసి ప్రేమగా నవ్వింది. ఇద్ధరీ ప్రేమలు కలసి వారిద్దరి పెదవులపై చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వులో నుంచి కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నట్లుగా శ్రీ వల్లభ గణపతి పదకొండు చేతులతో వచ్చాడత. ఇటు ఐదు చేతులు అటు ఐదు చేతులు, మధ్యలో తొండం, ఆ తొండంలో రత్న కలశం పెట్టుకున్నాడు. ఆయన యెడమ తొడ మీద వల్లభ దేవి కూర్చుని ఉన్నది. తిన్నగా పార్వతి అమ్మవారి వధకు వాచీ అమ్మ ఏమి చెయ్యమంటా వమ్మ అన్నాడు. పార్వతి పరమేశ్వర్ల ఆశీస్సులతో శ్రీ వల్లభ మహాగణపతి గజశారుడిపై ఒక్కడే యుద్దానికి వెళ్ళాడు. గజసరుడు వాడి రక్షస సేన అనేక కోట్ల మండి ఉన్నారు. శ్రీ వల్లభ గణపతి పార్వతి పర్మేశ్వరులను తలచుకుని తల వంచగనే, ఆయన నుంచి అనేక కిరణాలు వచ్చాయి. మొత్తం 7 కోట్ల మంత్రాలు మహా గణపతుల రూపంలో ఎలుక వాహనంపై వచ్చారు. 7 కోట్ల మని శ్రీ వల్లభ గణపతులు రక్షస మూకను చంపారు. శ్రీ వల్లభ మహా గణపతి తన దంతం పెరికి గజసూరన్ని సంహరించాడు. దేవతలంధరు, పార్వతి పరమేశ్వరులు, శ్రీ వల్లభ మహా గణపతిపై పూల వర్షం కురిపించారు. రాక్షసుల పీడ లేకుడా చేసినందుకు లోకలంతా శ్రీ వల్లభ గణపతిని పూజించి, సేవించి కీర్తించారు. ఆ విధంగా, శ్రీ వల్లభ మాహా గణపతి మన కోసం భూమి మీదకు ఈ క్షేత్రం లో వాచీ కూర్చున్నారు. మన కోరికలను, బాధలను తీర్చడానికి, ఉన్నాడు. ఈ వల్లభ మహా గణపతి చరిత్ర చదివితే ఎంతో పుణ్యం శ్రీ మహా గణపతి, శ్రీ వల్లభ దేవి రూపం, విశేషాలు ; శ్రీ వల్లభ మహా గణపతి, పార్వతి పరమేశ్వరుల చిరునవ్వులో నుంచి వచ్చాడు కదా ఆయన స్వరూపం ఇలా ఉంది. శ్రీ వల్లభ మహా గణపతి కుడి వైపున ఐదు చేతులు, ఎడమ ఐదు చేతులు ఉన్నాయి. మధ్యలో తొండం మొత్తం పదకొండు. ఈ కుడి భాగమంతా పురుష భాగం. ఎడమ భాగం అంతా స్త్రీ భాగం. కుడి వైపున ఉన్న ఆయుధాలు , బీజాపూర ఫలము, గద, చెరకు విల్లు , త్రిశూలం, చక్రం. యెడమ చేతిమ వైపు పద్మం, పాశ, నల్ల కలువ, వారి కంకూలు, దంతం, తొండంలో ఎన్నో రకాల రత్నలతో నిండిన రత్న కలశం. స్వామి వారి యెడమా తొడపై, పద్మం, చేతితో పట్టుకున్న శ్రీ వల్లభ దేవి ఆయనను పట్టుకున్నది కనుక స్వామి శ్రీ వల్లభ గణప్తి స్వామి గా పేరు వచ్చిది. పది జంటలు గల చేతులు అంటే ఈ పంచ భూత ప్రకృతిలో ఒక్కొక్క భూత ప్రకృతి, వీటి నుండి సూక్ష్మ భూతాలు పుట్టాయి. దీని నుండి శబ్ధ గుణకం ఆకాశం, స్పర్శ గుణకం వాయువు, రూప గుణకం అగ్ని, రస గుణకం జాలం, గంధ గుణకం పృధ్వీ, దాని నుండి విశ్వమూ పుట్టాయి. మనలను కాపాడటానికి పది చేతులతో వచ్చారు. శ్రీ వల్లభ గణపతి స్వామి సింధూర రంగు, ఎర్రని రంగు, రక్త గంధము, రక్త పుష్పా రంగులో ఉంటారు. శ్రీ వల్లభ దేవి మారిచి మహర్షి కుమార్తె, కశ్యప ప్రజాపతి చెల్లెలుగా చెప్పారు. శ్రీ వల్లభ గణపతి సర్వ గణపతులకు మూలమైన గణపతి. పరమాత్మ. మూడు మూర్తులు ఆయనలో ఉన్నారు. దేవి భాగవతంలో, గణపతి సహశ్రంలో స్వామి గురించి "శ్రీ వల్లభ గణపతి స్వరూపం పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపం. విశ్వ ఉత్పత్తి, విపత్తి, సంస్థితి ఈ మూడు పనులు చేస్తారు అని చెప్పింది. శ్రీ వల్లభ మహా గణపతి వుండేది స్వనంద లోకం. గణపతి మాయను వైనాయికి మాయ, సిద్ధ లక్ష్మి మాయ అంటారు. బ్రహ్మ శక్తి, సిద్ధ లక్ష్మి దేవియే . వల్లభ అని కూడా అంటారు. వల్లభ అంటే ఇష్టమైనది. అంటే మహా గణపతికి ఇష్టమైనది కనుక, ఆ తల్లి సిద్ధ లక్ష్మి దేవి శ్రీ వల్లభ గణపతి శ్రీ వల్లభ దేవిగా, గణపతి తో ఉంది కనుక శ్రీ వల్లభ గణపతి అయ్యారు. ఈ సృష్టికి మూలమైన పరమాత్మ స్వామి వారే. శ్రీ వల్లభ దేవితో కలసి మహా గణపతి సృష్టిని మన కోసం, మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, బ్రహ్మ గణములు , విష్ణు గణములు, రుద్ర గణములు , ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖుల, మంత్ర కర్మ గణములు, వాసు, రుద్ర, 12 ఆదిత్యులు, ఆశ్విని దేవతలు, పితృ ఋషి, ఇన్ద్రేయ గణముల్, సూర్యుడు, ఆగ్ని, వరుణుడు, విగ్న గణములు, నిరహంకార గణములు మొదలైన గానములను కాపలా పెట్టారు. అష్ట సిద్ధులు, స్వామి వారి పరిచారికలు, ప్రకృతిలో కనపడే 24, 25 తత్వములు వీటి ఆన్నిటిని పతి కనుక శ్రీ వల్లభ గణపతి అయ్యారు. శ్రీ వల్లభ మహా గణపతి, శ్రీవల్లభ దేవి ఆ విధంగా మనలను కాపాడటానికి మన క్షేత్రంలో ఉన్నారు. శ్రీ వల్లభ మహా గణపతి,శ్రీ వల్లభ దేవిని ఎలా పూజ చెయ్యాలి ? శ్రీ వల్లభ గణపతికి ప్రీతి పాత్రమైన వారం శుక్రవారం. ఈ స్వరూపాన్ని హృదయ మండపంలో , సూర్య మండలంలో, సూర్యోదయంలో సూర్య మండల మధ్యస్థుడిగా ఈ శ్రీ వల్లభ మహా గణపతిని ధ్యానించాలి. శ్రీ వల్లభ గణపతికి, గణపతి గాయత్రితో కానీ, ఓం శ్రీ మహా గణపతి యే నమహ. అని అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ఎంతో విశేష ఫలితం ఇస్తుంది. శ్రీ వల్లభ గణపతికి సంబంధించి వల్లభ ఉపనిషధ్, హెరంభ ఉపనిషద్, గణపతి ఉపనిషద్ అని ఉన్నది. పదకొండు అధ్యయలతో కూడిన గణేశుడు స్వయంగా చేసిన బోధ గణేశ గీత, గణపతి అధర్వ శీర్షం, గణేశ తాపీని, మొదలైన శ్రీ వల్లభ గణపతిని విశేషించి కీర్తించాయి. 7 కోట్ల మంత్రాల స్వరూపం. సప్త కోటి మహా మంత్రిత అవయవ ద్యుతిహీ. అని గణపతి సహస్రం చెబుతోంది. స్వామి వారికి కృష్ణ పక్ష చవితి, శుక్ల పక్ష సంకష్ట హర చవితి ఇష్టమైనది. మంగళవారం, శుక్రవారం, ఇష్టమైనవి. స్వామి వారికి గరికతో పూజ, అష్టోత్తర పూజ , అష్ట ద్రవ్యాలతో మహా గణపతి హవనం అంటే ఇష్టం. స్వామి వారికి ఉండ్రాల్లు, అరటికాయలు అంటే ఇష్టం. మన క్షేత్రం లో కొలువైన శ్రీ వల్లభ మహా గణపతినిక్ దర్శిస్తే వచ్చే ఫలితాలు. : శ్రీ వల్లభ మహా గణపతిని దర్శిస్తే, యేడు కోట్ల మహా మంత్ర జప ఫలితం వస్తుంది. సర్వ విఘ్నలు పోతాయి. శ్రీ వల్లభ గణపతి సర్వ శని దోషాలను పోగొట్టే రూప. వందే గజేంద్ర వదనం వామంకా రూడ వల్లభ శ్లిష్టం కుంకమ పరాగ శోణం కువలయ నీజారా ఘోరక పీడమ్. అని దూర్వాస మహర్షులు చెప్పారు. శ్రీ వల్లభ మహా గణపతి అయ్యవారు, అమ్మవర్ల చిరునవ్వు నుండి వచ్చారు. శ్రీ వల్లభ గణపతిని సేవిస్తే, పూజిస్తే, మనలందరిని ఇళ్ళలో, మన జీవితాలలో చిరునవ్వులే ఉంటాయి. శివ పర్వతుల ఇద్దరి తత్వములు, శక్తులు శ్రీ వల్లభ గణపతి లో మాత్రమే ఉన్నాయి. ఎవరు కోరుకున్న కోరికలను వారికి నెరవేర్చగల సర్వ శక్తివంతమైన రూపం. శివుణ్ణి, అమ్మవారిని ఇద్ధరీని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి వెయ్యింతలు ఫలితం శ్రీ వల్లభ గణపతిని చూస్తే వస్తుంది. శ్రీ వల్లభ మహా గణపతి యెడమా వైపున శ్రీ మహా లక్ష్మి అమ్మ వారిని సేవించడం వలన, దర్శించడం వలన మన ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటాయి. ధన ధాన్య రాశులు మన ఇంటనే ఉంటాయి. అష్ట్ర లక్ష్ములు మన ఇంట్లోనే ఉంటారు. శ్రీ వల్లభ మహా గణపతి దర్శనం వలన మన గ్రహ పీడలు, బాధలు, కష్టాలు, స్వామిని చూస్తే పారిపోతాయి. స్వామి దర్శనం వలన మన ఇంటిలో లేదు అన్న మాట ఉండదు. అన్నీ స్వామి ఇస్తాడు. స్వామికి ఉండ్రాల్లు , అరటికాయలు , ఫలాలు, ఇచ్చి గుఞ్జీల్లు తీస్తే , మిమ్మల్ని తన తొండంతో నిమిరి , మీకు అంతా మంచే చేస్తాడు. అందుకే శ్రీ వల్లభ మహా గణపతి మన క్షేత్రం లో ఉండటం మనం చేసుకున్నా గొప్ప పుణ్యం. శ్రీ వల్లభ గణప్తిని దర్శించి, తరించండి. సర్వం శ్రీ వల్లభ గణపతి మాయం జగత్. సర్వే జనాః సుఖినో భవన్తు. చిక్కవరం , గన్నావరమ్ నుండి నూజివీడు వెళ్ళు మార్గ మధ్యమున చిక్కవరంగ్రామము నందు ఈ దివ్యా క్షేత్రము ఉన్నది. కృష్ణా జిల్లా, గన్నావరమ్ ఎయిర్ పోర్ట్ నుండి కేవలం 7 కిలోమీ దూరంలో ఉంది. దర్శించండి