Search This Blog

Chodavaramnet Followers

Thursday, 28 August 2014

WHAT IS THE REASON BEHIND USING PALAVELLI IN GANESH PUJA


వినాయక చవితి పూజలో #పాలవెల్లి కడతాం ఎందుకు?

ఎక్కడైనా ఒక ప్రదేశానికి ఒక సినీహీరోనో లేక ఒక రాజకీయనాయకుడొ వస్తుంటే, వాళ్ళని చూడటానికి జనం బారులు తీరుతారు. మరి వినాయకచవితికి సాక్షాత అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమద్యాంతరహితుడైన ఆ పరంబ్రహ్మాన్ని#గణపతి స్వరూపంగా చిన్న మట్టి విగ్రహంలోని ఆవాహన చేస్తున్నాం. పరమాత్ముడు మనం పూజించే విగ్రహంలోని వస్తున్నాడంటే, ఆయన్ను సేవించడానికి దేవయక్షకిన్నెరకింపురుషాదులు, గ్రహాలు ఆ పూజాప్రదేశానికి చేరుకుని ఆ పరమాత్ముడిని సేవిస్తాయి. దీనికి సంకేతంగా మనం పాలవెల్లి కడతాం. పాలవెల్లి కట్టే పండులు అంతరిక్షానికి, అక్కడ ఉండే జ్యోతిర్మండలానికి, నక్షత్ర, తారా సమూహానికి, గ్రహాలకు సంకేతం. మనం మాత్రమే కాదు, మన కట్టే పాలవెల్లి ద్వారా ఆయా శక్తులు స్వామిని సేవిస్తాయి.