మతిమరుపుకి చక్కని ఔషదం బొప్పాయి
ఏమిటీ మీరీ మధ్య తరచూ మర్చిపోతున్నారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదా? అయితే బొప్పాయితో దానికి చెక్ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే మతిమరుపు ఉష్‌కాకి. బొప్పాయి పాలల్లో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట!

కాలేయ పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది