శ్రీ లలితాంబిక
"సుధాసింధో ర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీ పోవవనవతి చింతామణిగృహే
శివాకారే మఞ్ఞ్ఛే పరమశివపర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం "
భావం :
అమృత సముద్రముందు గల కల్పవృక్షములచే జట్టుకొనబడిన మణిద్వీపమందుం గదంబనము లొప్పు చింతామణి గృహమునందు బ్రహ్మ ,విష్ణు రుద్ర మహేశ్వరులనెడి నాలుగు కోళ్ళమంచుమందు, సదాశివుడు పఱ్పుపై నివసించు ఙ్ఞానానంద ప్రవాహమగు నిన్ను సేవించు ధన్యులరుదుగనున్నారు.