శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
రాజశ్రేణికి దాసులై సిరులు గోరం జేరగా సౌఖ్యమో
ఈ జన్మంబు తరింప చేయగల ని న్నేప్రోద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరా మానవు ల్పాపరా
జీ జాతాతిమదాంధ బద్దులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా !
భావము :
ఈశ్వరా , రాజులకు దాసులై, సంపదలు కోరుచు వారిని సేవించుటకు ఆసక్తి చూపుదురు. ఇది సౌఖ్యమా ? లేక ఈ జన్మమున మోక్షము ప్రసాదించగల, నిన్ను సేవించుట సౌఖ్యమా ? పాపముల చేత అంధులు, బుద్ధిహినులు, అయిన ఈ మనుష్యులు ఈ విషయము గ్రహింపలే కున్నారు.