Search This Blog

Chodavaramnet Followers

Monday, 23 June 2014

MOTHER'S MILKS IS THE BEST FOOD STUFF TO THE NEWLY BORN - TIPS FOR TAKING CARE OF NEWLY BORN KIDS GIVING MOTHER'S MILK


తల్లి పాలు ఎంతో శ్రేష్టం. ఎంత శ్రేష్టమంటే బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలను తాగిస్తే ఆ బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో పెరుగుతుంది. బిడ్డకు దీర్ఘయుష్షునిచ్చే అమృతం. మన పెద్దలు ఇవే మాటల్ని వారి అనుభవపూర్వవకంగా చెబుతారు. ఎందుకంటే వారికి వాటి విలువ తెలుసు కాబట్టి. కాని నేటి తరం ఆడవారు మాత్రం వారి పాలను ఇవ్వకుండా పోత పాలకు అలవాటు చేస్తున్నారు. దీని వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీనిపై అవగాహనా రాహిత్యం, పని వత్తిడి, మారుతున్న కాలానుగుణం వస్తున్న మార్పులూ కారణాలు.
‘తల్లి ప్రసవించిన తరువాత వచ్చే పాలను ముర్రు పాలు’ అంటారు. దీనిని ‘కీలస్ట్రామ్‌’ అని కూడా అంటారు. ముర్రుపాల ను పిండి పారమేయకూడదు. బిడ్డ పుట్టిన అరగంట లోపలే ముర్రు పాలను శిశువుకు తాగిపిస్తే బిడ్డ దీర్ఘ్ఘకాలం, ఆరోగ్యం, అభివృద్ధికి తొర్పడుతుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉండటమే గాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా కల్గి ఉంటంది ఆరోగ్యాభివృద్ధికి ప్రకృతి సిద్ధం. ఖర్చులేని పద్ధాతి కావడంతో తల్లిపాలు యివ్వడం వలన తల్లికి బిడ్డకి మంచి సంబంధం, ప్రేమ, అభిమానం అప్యాయత పెరుగుతుంది. శిశువుకి తన పాలు యివ్వడం వలన తల్లి శరీరంలో ‘ఆక్సిటిసిన్‌’ హార్మోను విడుదల వుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చేసిన సర్వేల ప్రకారం తల్లిపాలకు మించినది ఏదీ లేదని తేల్చి చెప్పారు. తల్లిపాలు త్రాగించటం వలన శిశుమరణాలు చాలా వరకు తగ్గాయని వారు నివేదికలో పేర్కోన్నారు.గర్భాశయం ప్రసవం తరువాత తొందరగా సహజ పరిమాణానికి తగ్గడానికి ఈ హార్మోను సహయపడుతుంది. తరుచుగా శిశువుకు పాలు యివ్వడం వలన రొమ్ములు గడ్డ కట్టవు, నొప్పి ఉండవు, స్థూలకాయం ఏర్పాడటం తగ్గుతుంది.

ముఖ్యంగా ముర్రుపాలలో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు, ముఖ్యంగా ఎ,డి,బి12 విటమిన్లు, రోగకారక క్రమ నిరోధకలు ఉంటాయి. అంతే గాకుండా తల్లిపాల వలన మెదడు,నేత్రాల నిర్మాణం అభివృద్ధికి సహాయపడతాయి. ఊపిరితిత్తులకు సంబం ధిం చిన జబ్బులు అలర్జీలు, పేగుల్లో రుగ్మతలు, న్యూమోనియా, మూతసంబంధిత వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు. బిడ్డ పుట్టిన పటినుంచి ఆరునెలలకాలం తల్లిపాలు సంపూర్ణ ఆహారంగా పని చేస్తాయి.
బిడ్డకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో ఉం చటమేగాక వ్యాధి-నిరోధక శక్తిగా పని చేస్తాయి. ఈ ఆరు నెలల కాలం బిడ్డకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం అవసరముండదని వైద్యుల చెబుతారు. ఇలా ఇవ్వటం తల్లికి బిడ్డకు ఎంతో మంచిదని చెబుతారు. పోతపాలకు అలవాటు చేస్తే శిశువు తల్లిపాలను పూర్తిగా తాగడం మానేస్తాదు. తల్లితన బిడ్డకు తన పాలు తాగిచటమనేది ఒక సహజమైన జీవ క్రియ. నాలుగు వందల పోషకాపదార్థాలు ఉండే తల్లిపాలకు ఏ మేక, గేదె పాలు ప్రత్యేమ్నాయం కావు.
1. తల్లిపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధకటీకాగా ఉపయోగపడుతుంది.
2. బిడ్డల్ని వదిలి కూలి పనికి వెళ్లే తల్లులు తమ పాలను ఒక పరిశుభ్రమైన గ్లాసులో పిండి సురక్షిత ప్రాంతంలో ఉంచి 8గంటలలలోగా ఆపాలను శిశువువలకు చెంచాతోగానీ లేదా ఉగ్గుగిన్నెతోకాని పట్టవచ్చును
3. ఒక తల్లి మరో తల్లిబిడ్డలకు అత్య్యవసరమైన సమయాలలో పాలు పట్టించవచ్చును.
4. ధీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహామేరకు శిశువు పాలివ్వా లి.హెచ్‌.ఐవి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్న తల్లులు పోతపాలు సుక్షితంగా ఇవ్వలే నప్పుడు కేవలం తమ పాలను 6నెలల వరకు శిశువు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం.
తల్లి పాల శ్రేష్టత తెలుసుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తల్లి పాలు పట్టడం ఎంతో మంచిది.