నేరేడు పండు
నేరేడు పండ్ల సీజన్ మొదలైంది. కొంచెం తియ్యగా, కొంచెం వగరుగా ఉండే నేరేడుతో చాలా ఉపయోగాలు వున్నాయి. ముఖ్యంగా నేరేడు పండుకు విషాన్ని హరించే శక్తి ఎక్కువట.
శరీర భాగంలో గాయాలైతే నేరేడు ఆకును గాయంపై కట్టుగా కట్టవచ్చు. ఆకు విషాన్ని పీల్చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
కడుపులో ఉండే నులుపురుగులను నేరేడు చంపేస్తుంది. నోటి క్యాన్సర్ నిరోధానికి నేరుడు ఉపయుక్తం.
మధుమేహం బాధితులకు నేరేడు పండు ఒక వరం, నేరేడు గింజల పొడిని కాచి, వడకట్టి తాగితే చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలకు నేరేడు ఓ టానిక్.
మూత్రం రాక ఇబ్బందిపడే వారికి నేరేడు బాగా ఉపయోగపడుతుంది. నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంత క్షయంతో బాధపడే వారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కలిస్తే ఉపశమనం ఖాయం.
నోటిలో చిన్నపూతలాగా వస్తే రెండు నేరేడు పండ్లు తింటే వెంటనే మంట, బాధలకు విముక్తి కలుగుతుంది.
నేరేడులో విటమిన్ ఏ, సీలు అధికంగా ఉన్నాయి. ఆక్సాలిక్ ఆమ్లం ఒక ప్రత్యేకమైన రుచిని పండుకు అందిస్తుంది.
కఫం తగ్గిస్తుంది. హైబ్రిడ్ పండ్ల కంటే నాటు పండ్లు తింటే ప్రయోజనం.
గర్భిణులు ఈ పండ్లు వాడకూడదు.
The jamun (also known as jambas, jamun, jambolan,
rajaman, kala jamun, neredu, naval, nerale, jamali,
java plum, black plum and black berry)