Search This Blog

Chodavaramnet Followers

Saturday, 10 May 2014

KITCHEN ITEM ZINGER - WAY 2 HEALTH WITH GINGER


అల్లం వలన ప్రయోజనాలు

* అల్లం+బెల్లం కలిపి నూరి, పిప్పర్మెంట్ బిళ్లల పరిమాణంలో బిళ్లలు కట్టి ఆరనిచ్చి సీసాలో పోసుకొని, ఒక్కొక్క బిళ్లచొప్పున రెండు లేక మూడుసార్లు తింటూ ఉంటే అరచేతిలో చెమట పట్టడం, పొట్టురాలటం తగ్గుతాయి.

* నిమ్మరసంలో ఉప్పు లేకుండా అల్లం ముక్కలే నాన బెడితే అల్లం మురబ్బా అంటారు. అల్లం మురబ్బా చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది.

* విరేచన బద్ధతకు ఇది మంచి ఔషధం. అల్లాన్ని ఎండిస్తే శొంఠి తయారవుతుంది. ఇది అల్లంకన్నా సౌమ్యంగా పనిచేస్తుంది. మామిడి అల్లం వేరే మొక్క. రుచిలో సామ్యత తప్ప, అల్లం గుణం ఏవీ దానికి లేవు.

* ఫాస్ఫరస్, కాల్షియం, ప్రొటీన్లు అల్లం రసంలో ఎక్కువగా ఉంటాయి. నొప్పి, జ్వరం తగ్గించే గుణాలు అల్లం రసానికి కలగటానికి అందులో జింజిరోన్, షోయగోల్ అనే రసాయనాలు ఉండటం కారణం. పేగులను వేగంగా కదిలించి, విరేచనం అయ్యేలా చేస్తాయి.

* వాతాన్ని, కఫాన్నీ అమోఘంగా తగ్గిస్తుంది గానీ బాగా వేడి చేస్తుంది. అందుకని వేడి శరీరతత్వం ఉన్నవాళ్ళు, కడుపులో మంట ఉన్నవాళ్ళూ అల్లాన్ని జాగ్రత్తగా వాడాలి.

* దేహకాంతిని మిరపకారం తగ్గిస్తుంది. అల్లం వృద్ధినొందిస్తుంది.