తిధి, వార, నక్షత్ర, మాస, రుతువుల వివరణ; ఇది మిస్ అయితే మీరు జీవితంలో తెలుసుకోవాలసిన కొన్ని విషయాలను మిస్ అయినట్లే..
మన భారత సంస్కృతీ సాంప్రదాయాలు చూడండి ఎంత నిర్దిష్టంగా ఉన్నాయో:
ఒక సంవత్సరానికి రెండు ఆయనములు- ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
ఋతువులు 6 :
వసంతం, గ్రీషం, వర్ష, శరదృరుతువు, హేమంత, శిశిర
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
పక్షములు 2 :
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాద్యమి నుంది అమావాస్య వరకు కృష్ణపక్షం.
తిధులు 16 :
పాడ్యమి, విదియ తదియ, వవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
వారములు 7 :
ఆదివారం - భానువాసరే
సోమవారం - ఇందువాసరే
మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే
గురువారం - గురువాసరే
శుక్రవారం - భృగువాసరే
శనివారం - స్థిరవాసరే / మందవాసరే
నక్షత్రములు: ఇరవై ఏడు..
అశ్విని,భరణి,కృత్తిక,రోహిణ
మన భారతీయ రుతువులు , మాసములు, ఆయనములు, వాటి ధర్మములు ఎంత ఖచ్చితత్వముగా ఉండే వంటే... క్షణాలతో సహా లెక్కించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం దాని ప్రత్యేకత... జ్యోతష్యం ఒక శాస్త్రం.. అది మూఢ విశ్వాసం అని కొట్టి పడేయ నవసరం లేదు.. మనం ఒక సంవత్సరంలో ఎన్ని సూర్య గ్రహణాలు, ఎన్ని చంద్ర గ్రహణాలు వస్తాయో, గ్రహ రాశుల సంక్రమణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం మామూలు విషయం కాదు.. ఇంతటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది కాబట్టే కోపర్నికస్, గెలిలియో, లాంటి ఖగొళ శాస్త్రజ్ఞుల కంటే మన ఆర్యభట్టుడు, వరహమిహురుడు ఖగోళ శాస్త్రాన్ని రచించ గలిగారు... అప్పట్లోని తెల్ల దొరలు మన జ్యోతిష్య శాస్త్రజ్ఞుల ప్రతిభ చూసి ఆశ్చర్య పోయేవారట..
సినిమా హీరోల వివరాలు మొదలగు పనికి రాని విషయాలకు బదులుగా ఈ టపాను షేర్ చేయండి.. మన సంస్కృతీ సాంప్రదాయాలను అందరితో పంచుకోండి.