Search This Blog

Chodavaramnet Followers

Thursday, 13 March 2014

TO OVER COME "KUJA DHOSHAM" PERFORM MANGALA CHANDI DEVI PUJA - TELUGU BHAKTHI ARTICLE ON KHUJA DHOSHAM


కుజదోష నివారణకు 'మంగళ చండీదేవి" ని పూజించాలి అని 'బ్రహ్మవైవర్త పురాణం' చెబుతోంది.

కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజ దోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే. పెళ్లి కావలసిన అమ్మాయికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులుపడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకుగాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే 'మంగళచండీ దేవి' ని పూజించాలని 'బ్రహ్మవైవర్త పురాణం' చెబుతోంది.

ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానాఅవస్థలు పడుతున్నారో ... ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే 'మంగళచండీ దేవి'. కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు ... సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు.

మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, రెండు పూటలా మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే సత్ఫలి తాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.