మహోన్నతమైన సంస్కృతి మనది.
మన ఆచారాలు, సంప్రదాయాలు ఎంతో విలువైనవి.
మనం పూజించే ప్రతి దైవంలో, పూజా విధానంలో ఏదో ఒక విశిష్టత, సామాజిక రక్షణ, శారీరిక ఆరోగ్యాలకి సంబంధించిన క్రియలు ముడిపడి ఉన్నాయి. ప్రాతః కాల స్నానం వల్ల మన శరీరంలో పేరుకున్న కొవ్వు పదార్ధం కరిగి, శీతోష్ణ స్థితులకి తట్టుకోగల శక్తి మనకి కలుగుతుంది. అదే సమయంలో గాయత్రి మంత్రం చదవడం వల్ల, అతి ముఖ్యమైన నాడీ కేంద్రాలు ఉత్తేజితమై, మన బుద్ది వికసిస్తుంది. ఉదయించే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల, సంధ్య సూర్యుని ప్రధమ కాంతిలో వెలువడే నీలలోహిత కిరణాలు(altra violet rays) శరీరానికి సహజ సిద్దమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇంట్లో పూజలో వాడే నువ్వుల నూనె, వెలిగించే అగరవత్తులు, హారతిలో వాడే కర్పూరం సూక్ష్మ జీవులని నశింపచేయడమే కాకుండా, కంటికి కనిపించని వ్యతిరేక శక్తులని(Negative Force/ Energy) అడ్డుకుంటాయి. పూజలో వాడే పసుపు, కుంకుమ, విభూతి, గంధం; పూజించే చెట్లు, తీర్థ యాత్రలకి వెళ్ళే ప్రదేశాలూ, అక్కడి స్థల విశిష్టత, మనం చదివే మంత్రాలూ, వ్రతాలూ, ఆతివల్ల లాభాలూ... ఇలా చెప్పుకుంటూ పొతే మన శాస్త్రాలు వివరించనిదంటూ ఏదీ లేదు. అయితే కొందరు, మన విధి విధానాలని బ్రష్టు పట్టించడానికి విపరీతార్ధాలు తీసి చులకన చేస్తున్నారు. మన సంస్కృతి కాపాడుకునే బాధ్యత మనదే. ముందు మనం గౌరవిద్దాం. మన సంప్రదాయాలని ఎలా గౌరవించాలో మన ముందుతరాలకి నేర్పుదాం.