Search This Blog

Chodavaramnet Followers

Thursday, 19 September 2013

TELUGU WOMEN BEAUTY SKIN CARE TIPS



ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం,వంటివి జరగవచ్చు.ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు -
»
బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
»
ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి.
»
నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.

ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
»
తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
»
నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు.
»
టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
»
రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
»
ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
»
కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.
»
కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి.