Search This Blog

Chodavaramnet Followers

Wednesday 15 May 2013

WHAT IS JAUNDICE - HOW IT PASSES FROM ONE TO ANOTHER - EFFECT OF JAUNDICE ON HEALTH - TIPS FOR REMEDIAL MEASURES FOR JAUNDICE


కాలేయ వ్యాధుల్లో ప్రధానమైనదైన పచ్చ కామెర్లు లేదా జాండిస్‌ ఈ కింది కారణాల వలన సోకుతుంది. వైరస్‌, మద్యపానం, మందుల విష ప్రభావం (టాక్సిసిటీ), ప్రకృతిలోని విషపదార్థాలు, విల్‌సన్‌ వ్యాధి, ఆటోఇమ్యూన్‌ వాధులు, అక్యూట్‌ ఫాట్టీ లివర్‌ (గర్భిణీ స్త్రీలలో), లెప్టోస్పైరోసిస్‌, బడ్‌చారి సిండ్రోం, షాక్‌ (గుండె వైఫల్యం చెందడం) మొదలైన వాటి వలన సోకుతాయి.
వైరల్‌ హెపటైటిస్‌

సుమారు 20 సంవత్సరాల క్రితం వరకూ వైరల్‌ హెపటైటిస్‌ అనే వ్యాధి హెపటైటిస్‌ ఎ, బి వైరస్‌ల వలన మాత్రమే వస్తుందని అనుకునేవారు. కాని ప్రస్తుతం హెపటైటిస్‌ సి, డి, ఇ, జి అనే వైర స్‌ల వలన కూడా వస్తుందని గుర్తించారు. హెప టైటిస్‌ వైరస్‌లే కాకుండా, ఇతర వైరస్‌లైన సైటో మెగాలోవైరస్‌, ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌, ఎల్లో ఫీవర్‌ వైరస్‌, రుబెల్లా వైరస్‌ వలన కూడా పచ్చ కామెర్లు రావచ్చు.

వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగుల్లో హెర్పిస్‌ సింప్లెక్స్‌, వారిసెల్ల, అడినోవైరస్‌ల వలన కూడా పచ్చకామెర్లు తీవ్రస్థాయిలో వస్తుంది.

ఇంక్యుబేషన్‌ పీరియడ్‌

వ్యాధి కారక క్రిమి శరీరంలో చేరిన తరువాత వ్యాధి లక్షణాలు బైట పడటానికి మధ్య కాలాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు.
హెపటైటిస్‌ ఎ -15 నుంచి 45 రోజులు, హెప టైటిస్‌ బి -30 నుంచి 180 రోజులు, హెపటైటిస్‌ డి -30 నుంచి 180 రోజులు, హెపటైటిస్‌ సి -15 నుంచి 160 రోజులు, హెపటైటిస్‌ ఇ -14 నుంచి 60 రోజులు.

జాండిస్‌ బైటపడక ముందు ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి.

ఆకలి లేకపోవడం, అలసట, నీరసం,వికారంగా ఉండటం, వాంతులు, కండరాల, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరము, వాసనలు సహించలేకపోవడం, భోజనం రుచిం చకపోవడం, మలం బూడిద రంగులో రావడం మొదలైనవి.
జాండిస్‌ బైట పడిన తరువాత పైన పేర్కొన్న లక్షణాలు తగ్గుతాయి, బరువు కోల్పోవడం (రెండు న్నరనుంచి ఐదు కిలోల బరువు కోల్పోతారు), కాలేయం వాపు ఎక్కి పెద్దదై, నొప్పిగా ఉండటం, ప్లీహం పెద్దది కావడం, శరీరంపై దురద రావడం (కొంతమందిలో), కళ్లు, చర్మం, ఆమత్వచపు పొరలు పచ్చబడటం

తగ్గుముఖం పట్టే దశ

జాండిస్‌ బైటపడటానికి ముందు ఉన్న లక్ష ణాలు తగ్గిపోతాయి. కాలేయం నార్మల్‌ సైజుకు వస్తుంది. లేదా కొంచెం పెద్దగా ఉంటుంది. ఎల్‌ఎ ఫ్‌టి నార్మల్‌గా ఉంటుంది. కొందరిలో కొంచెం అబ్‌నార్మల్‌గాఉండవచ్చు. కొందరిలో జాండిస్‌ బైట పడకుండా, వ్యాధితో బాధపడటం జరుగవచ్చు.

హెపటైటిస్‌ ఎ వైరస్‌ వ్యాధి

ఇది ఎంటిరోవైరస్‌ అనే పికోర్నవిరిడే  కుటుంబా నికి చెందిన వైరస్‌. ఈ వైరస్‌ వలన వచ్చే పర్చ కామెర్లను ఇన్‌ఫెక్షువస్‌ హెపటైటిస్‌ లేదా ఎపిడ మిక్‌ జాండిస్‌ అంటారు. ఈ వైరస్‌ వలన వచ్చే వ్యాధికి రిజర్వాయర్‌ వ్యాధిగ్రస్తుడే. వ్యాధిగ్రస్తుడు వ్యాధి లక్షణాలతో కనిపించకపోవచ్చు. లేదా వ్యాధి లక్షణాలు లేకుండా ఇతరులకు వ్యాధి సోకడానికి కారణం కావచ్చు.
కామెర్లు బైటికి కనపడక ఉన్న రెండు వారాల ముందు, కామెర్లు బైటికి కనిపించిన తరువాత ఒక వారం వరకూ వ్యాధిగ్రస్తుడు వేరే వారికి ఈ వ్యాధిని సంక్రమింపజేస్తాడు. వ్యాధిగ్రస్తుడు మలం ద్వారా ఈ వైరస్‌ను విసర్జిస్తాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతియేటా సుమారు లక్షకు పదినుంచి 50 మంది ఈ వైరస్‌ వలన వచ్చే పచ్చ కామెర్లతో బాధపడుతు న్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వ్యాధి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నది.

కారణాలు

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఒకే ఇంట్లో చాలా మంది నివసించడం, కలుషిత నీరు, పాలు, ఆహార పదార్థాల సేవనం తదితర కారణాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఒక్కొ క్కసారి కలుషిత ఇంజక్షన్‌ సూదుల ద్వారా కూడా రావచ్చు. లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించ వచ్చు. హోమో సెక్సువల్స్‌లో ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు

హెపటైటిస్‌ ఎ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన సమయంనుండి వ్యాధి లక్షణాలు బైటపడటానికి 15 నుంచి 45 రోజులు పడుతుంది. ఈ వ్యాధి అందరికి వస్తుంది. కాని చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంది. పెద్దవారిలో కొంచెం తీవ్రస్థాయిలో వస్తుంది.
ఒకసారి వ్యాధి వస్తే జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుంది. కాని 5 శాతం మందికి మరొకసారి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఎ వైరస్‌తో జాండి స్‌కు గురైన వ్యక్తికి ఎ వైరస్‌తో జాండ్‌ రాదు. కాని ఇతర వైరస్‌లతో జాండిస్‌ వచ్చే అవకాశాలు న్నాయి. అయితే 5 శాతం మందిలో మాత్రం మళ్లీ ఎ వైరస్‌తోనే జాండిస్‌ రావచ్చు.

ఆకలి లేకపోవడం, వాంతి అయ్యేట్లు ఉండటం, వాంతులు చేసుకోవడం, అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తల నొప్పి, వెలుతురు చూడలేకపోవడం, గొంతు నొప్పి, ముక్కులోనుండి నీరు కారడంలాంటి లక్షణాలతో మొదలవ్ఞతుంది.
భోజనం రుచించకపోవడం, వాసనలు సహించ లేకపోవడం, సిగరెట్లు తాగే వారికి సిగరెట్‌ పొగ వాసన కూడా సహించకలేకపోవడం జరుగుతుంది. వ్యాధిగ్రస్తుడిలో జ్వరం 100 నుంచి 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ ఉండవచ్చు. కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో జ్వరం అసలు కనిపించకపోవచ్చు.

మూత్రం పచ్చగా రావడం, కళ్లు, తరువాత ఒళ్లు పచ్చబడటం జరుగుతుంది. మలం మట్టి రంగులో ఉంటుంది. కొంతమందిలో విరేచనాలు అవుతాయి. కాలేయం పెద్దదిగా అవడం వలన కడుపులో నొప్పి వస్తుంది.

పరీక్షలు

కాలేయం పని తీరు (లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ - ఎల్‌ఎఫ్‌టి), మూత్ర పరీక్ష (బైల్‌ సాల్ట్స్‌, బైల్‌ పిగ్మెంట్స్‌), హెపటైటిస్‌ ఎ వైరస్‌ I్ణ లీ, I్ణ బి, యాంటి బాడీల పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అవసరమై నప్పుడు చేయాల్సి ఉంటుంది.

నివారణ

సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం ద్వారా వ్యాధిగ్రస్తుడి మలంలోని వైరస్‌ను క్షీణింప చేయాలి. తద్వారా ఇతరులకు ఈ వ్యాధి సోక కుండా చేయవచ్చు. నీరు, ఆహారం, పాల వంటి పదార్థాలు కలుషితం కాకుండా కాపాడాలి. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.