Search This Blog

Chodavaramnet Followers

Wednesday 15 May 2013

STEM CELL BEAUTY FOREVER - ARTICLE

చర్మానికి నిగారింపు రావడంతో మనిషిలో ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. ఇది పెద్దగా ఖర్చు కూడా లేని చక్కని ప్రభావం కలిగిన వైద్య చికిత్సా విధానం. అయితే ఇది నిపుణులైన యాంటీ ఏజింగ్‌ వైద్యుల పర్యవేక్షణలోనే నిర్వహించాల్సి ఉంటుంది. స్టెమ్‌ సెల్‌ పీల్‌ పేరిట బ్యూటీక్లినిక్స్‌లోనూ కొన్ని రకాల ట్రీట్‌మెంట్లు జరుగుతూంటాయి. అయితే అవి చర్మంపైన మాత్రమే పనిచేస్తాయి. మూలాలకు చికిత్స చేయవు. యాంటీ ఏజింగ్‌ చికిత్స ఒక శాస్త్రీయ వైద్య విధానం. ఇది బ్యూటీ ధెరపీ కంటే చాలా భిన్నం. కాస్మెటిక్‌ పీల్స్‌కి, స్టెమ్‌ సెల్‌ పీల్స్‌కి ఉన్న తేడాను తెలుసుకోవడం చాలా అవసరం. యాంటీ ఏజింగ్‌ నిపుణుల వద్ద స్టెమ్‌ సెల్‌ పీల్‌ చేయించుకుంటే శాశ్వతమైన, చక్కని ఫలితాలు లభిస్తాయి.

వయసు మీద పడటం, ముదిమి రావడం సహజధర్మం. వయసు మీద పడే కొద్దీ వార్థక్య లక్షణాలు వెన్నంటి వస్తాయి. చర్మం ముడతలు పడటం, కళ్లకింద, నోటి చుట్టూ గీతలు, వలయాలు ఏర్పడటం, జుట్టు తెల్లబడటం వంటివి సహజంగా వస్తాయి. దీనితో పాటు శరీరం బలహీనపడుతుంది. ఎముకలు బలహీనమౌతాయి. శరీర అవయవాల పనితీరు మంద గిస్తుంది. వీటన్నిటి వల్ల ముసలితనం ఎంతో భయకరంగా కనిపిస్తుంది.


వార్థక్యం రావడం సహజం. అయితే యవ్వనంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, శారీరకంగా బలంగా ఉండాలన్న కోరిక ఉండటం అంతే సహజం. మనిషి దీనికోసం నిరంతరం ప్రయత్ని స్తూనే ఉంటాడు. నిరంతర వ్యాయామం, నియమిత ఆహారపు టలవాట్లు, సరైన జీవనశైలి వల్ల ముసలితనాన్ని కొంతవరకూ దూరంగా ఉంచవచ్చు. వయసు మీద పడ్డా వయసు తగ్గినట్టు కనిపించవచ్చు.

ప్రపంచ వ్యాప్త పరిశోధనలు

యాంటీ ఏజింగ్‌ అంటే వార్థక్య జనిత వ్యాధుల నివారణపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్యులు పలురకాల చికిత్సా విధానాలను పాటించి యౌవనాన్ని శాశ్వతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడేందుకు, వార్థక్య కారక హార్మోన్ల స్రావాన్ని పెంచేందుకు హార్మోన్‌ చికిత్స చాలా దేశాల్లో చేస్తున్నారు. ఇలాంటి అత్యంత ప్రభావవంతమైన మరో అత్యాధునిక చికిత్సా విధానమే స్టెమ్‌ సెల్‌ పీల్‌ చికిత్స. నిజానికి దీన్ని భవిష్యత్తులో యాంటీ ఏజింగ్‌ చికిత్స రూపురేఖల్నే మార్చేసే చికిత్సగా వైద్యులు పేర్కొంటున్నారు. యూరప్‌లో దీనిపై జరిపిన పరిశోధనల ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి.

ఇవి ముడతలను తగ్గించడం, చర్మం బిగువును, నిగారింపును పెంచడం, కళ్లచుట్టూ వలయాలను తొలగించడం చేస్తాయి. శరీరంలోని కండరాలను, నరాలు, ఎముకల పటిష్టతను పెంచుతాయి. మనిషి చురుకుగా ఉండేలా చేస్తాయి. రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సరిచేసి, వార్థక్య కారణాల వల్ల వచ్చే జీర్ణకోశవ్యాధులు, ఆర్థ్రరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకే స్టెమ్‌ సెల్‌ పీల్‌ విధానాన్ని చాలా దేశాల్లో పాటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇది మనదేశంలోకి వస్తోంది.


స్టెమ్‌ సెల్‌ అంటే...

స్టెమ్‌ సెల్‌ అంటే మూలకణం అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రాణుల శరీరంలో ఉండే ఈ మూలకణాలకు పునరుత్పత్తి చెందే లక్షణం ఉంటుంది. దెబ్బ తిన్న లేదా చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను అందించే సామర్థ్యం ఉంటుంది. ఇవి డెడ్‌స్కిన్‌ను తొలగించి చర్మం, శరీరాంగాలు, అంతర్గత అవయవాలకు నవచైతన్యాన్ని ఇవ్వగలవు. దెబ్బ తిన్న నాడీకణాలు, కండరాల కణాలు, గుండె, మెదడుకు చెందిన కణాలకు కూడా నవచైతన్యాన్ని ఇవ్వగలవు. స్టెమ్‌ సెల్‌ పీల్‌ శరీరంలోని ఈ మాస్టర్‌ సెల్స్‌లోని సహజమైన రిపేరింగ్‌ వ్యవస్థను ఉపయోగించి, వార్థక్యాన్ని దూరం చేయగలుగుతుంది.

ఎలా చేస్తారు?

ఈ చికిత్సలో సాధారణంగా మాలుస్‌ డొమెస్టికా అనే యాపిల్‌ పండులోని స్టెమ్‌ సెల్స్‌ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ యాపిల్‌ జాతి చాలా అరుదైనది. అంతేకాదు, ఇది చాలాకాలం జీవించే లక్షణం కలిగున్నది. అందుకే శాస్త్రవేత్తలు దీని స్టెమ్‌ సెల్స్‌పై పరిశోధనలు జరిపి, దానిలో వార్థక్యాన్ని దూరం చేసే లక్షణాలున్నాయని కనుగొన్నారు. మాలుస్‌ డొమెస్టికాతో తయారైన స్టెమ్‌ సెల్‌ పీల్‌ను  శరీరానికి పట్టీలా వేయడం జరుగుతుంది.

ఈ స్టెమ్‌ సెల్‌ పీల్‌ చర్మంలోని పై భాగమైన ఎపి డెర్మిస్‌నే కాక, లోపల ఉండే డెర్మిస్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ చికిత్సలో ఉండే రెండు దశలుంటాయి. తొలిదశను సాలిడ్‌ ఫేజ్‌ అంటారు.

ఇది చర్మంపై భాగాలను ప్రభావితం చేసి, ముడుతలను తొలగిస్తుంది. రెండవ దశను లిక్విడ్‌ ఫేజ్‌ లేదా ద్రవదశ అంటారు. ఈ దశలో చర్మం లోపలి భాగాలపై స్టెమ్‌ సెల్‌ పీల్‌ పనిచేస్తుంది. ని ద్వారా ముసలితనం రావడాన్ని ఆలస్యం చేయడం జరుగుతుంది. ఇలా రెండు దశల్లో ఇది పనిచేస్తుంది.