Search This Blog

Chodavaramnet Followers

Wednesday 15 May 2013

NEEDS TO CHANGE BEHAVIOUR OF MOM'S AND DAD'S INFRONT OF THEIR CHILDREN - KEEP SOCIETY THE BEST - TIPS FOR MOM'S AND DAD'S

పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడడం, అసభ్యపదజాలం వాడడం చేయకూడదు.
అవి వారి సున్నితమనసుపై ఎంతో ప్రభావం చూపుతాయని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.
్య ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకధోరణిలో విపరీతమైన ఒత్తిళ్లతో ఉండకూడదు. మీరే అలా ఉంటే మిమ్మల్ని వారు గమనించినపుడు అలాగే ఉండాలేమో, ఏ విషయానికైనా అలాగే స్పందించాలేమో అనుకొనే అవకాశం కూడా ఉంది.
్య పిల్లల్ని చదువు, చదువు అని పోరుపెట్టడం వారికి చదువుపట్ల అయిష్టత ఏర్పడేలా చేయవచ్చు. అలా వారికి మాటిమాటికీ చెప్పడంతో చదవడం వారి బాధ్యత అనేదానికంటే ముందు చెప్పడం మీ బాధ్యత అన్నట్లుగా అర్థంచేసుకుంటారు. అయితే మీరు వారి ఎదురుగా ప్రతిరోజూ కొంతసమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే మీకు వారిని చదువుకోమని చెప్పే అవసరం చాలావరకు తగ్గినట్లే అవుతుంది.   చదువుకోవడానికి సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి అనేది వాళ్లు మీనుంచి నేర్చుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది.


 క్రమశిక్షణ, బాధ్యత ఇవి కూడా మిమ్మల్ని గమనించడం ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. మీరు మీ పెద్దవాళ్లతో నడుచుకునే తీరు, తల్లిదండ్రుల మధ్య ఉండే సత్సంబంధాలు, మాట్లాడుకునే విధానం ఇవన్నీ పిల్లలు గమనిస్తూనే ఉంటారు. చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్దవాళ్ల మాటలను లెక్కచేయకుండా ఉండటమనేది చాలావరకు ఆయా కుటుంబాల తీరు అయిఉంటుంది.  
్య మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ రావాలని, తోటి కుటుంబ సభ్యుల పట్ల, తాము చేయవలసిన పనుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మీరు కోరుకోగానే సరిపోదు, అవన్నీ నేర్చుకోవడానికి వారు మిమ్మల్నే పాఠశాలగా ఎంచుకుంటారనే విషయాన్ని మరచిపోకండి.
్య మీరు పిల్లలతో మాట్లాడే తీరు ఎంత ముద్దుగా, కచ్చితంగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందో వారు అంత మంచివారుగా, మంచి మాటలు మాట్లాడేవారుగా, మంచి సంబంధబాంధవ్యాలు నెరపే వారుగా తయారవుతారు. పిల్లలు మీ మాటతీరును గమనిస్తూనే ఉంటారు. అదే ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అనేదానికి వారు ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి పిల్లల ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం వారికి చెప్పే పాఠాలుగానే తీసుకోవాలి.