నదీతీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఓరోజు పంట విత్తనాలకోసం పక్కగ్రామానికి బయలుదేరాడు. కాలినడకన నదీతీరం గట్టుపై నడుస్తున్నాడు. పైన ఎండ మండిపోతోంది. దూరంగా ఓ మామిడిచెట్టు కనపడడంతో కాసేపు దాని నీడన అలసట తీర్చుకోవటానికి వెళ్లాడు. కొద్దిసేపు విశ్రమించాక తలపైకెత్తి చూస్తే పైన కొడితే రాలేలా ముగ్గిన మామిడిపళ్లు కనపడ్డాయి. నోట్లో నీళ్ళు ఊరి తినాలనే కోరిక పుట్టింది. చుట్టూ నదీ తీరంలో ఇసుక తప్ప రాయి కనపడలేదు. వెతకగా వెతకగా దూరంగా కాసిని రాళ్లు దొరికాయి.
వాటిని తెచ్చి విసరటం ప్రారంభించాడు. ఒక్కరాయి తగలటంలేదు. విసురుతూనే ఉన్నాడు. ఒక్కకాయ రాలలేదు. కాసేపటికి ఒక రాయి తప్ప మిగిలిన రాళ్లు అయిపోయాయి. చివరి రాయి. అతని చేయి వణికింది. ఈ రాయి తగిలి మామిడికాయ పడుతుందా, పడదా? ఆలోచిస్తూ నిలబడ్డాడు. విసిరిన రాళ్లన్నీ నీళ్లలోపడ్డాయి. తిరిగి ఏరి తెచ్చుకోవడానికి లేదు.
ఆలోచనలో ఉన్న వీరయ్యను అటుగా వచ్చిన షావ్ఞకారు బంగారయ్య పలకరించాడు. రాళ్లన్నీ అయిపోయినా ఒక్కకాయ తగిలేల కొట్టలేకపోయానని బాధపడుతూ చెప్పాడు. ఇంకా రాళ్లు లేవా? బంగారయ్య అడిగాడు. అంతా ఇసుకేగానీ రాళ్లు ఎక్కడివి? అన్నాడు వీరయ్య . సరే ఆ రాయి ఇటివ్ఞ్వ నేను కొడతాను అని అడిగిన అతనికి రాయిని అందజేశాడు. ఆ రాయిని చూసిన బంగారయ్య కళ్లు మెరిశాయి. మొత్తం రాళ్లు అయిపోయాయా? అని మళ్లీ అడిగాడు. నిజంగానే లేవ్ఞ. విసిరిన రాళ్లన్నీ నీళ్లల్లో పడ్డాయి అన్నాడు. వీరయ్య ఎంతపని చేశావ్ఞ? ఇది మామూలు రాయి కాదు. అత్యంత విలువ గల రత్నం ఆ విసిరిన రాళ్లన్నీ ఉంటే నువ్ఞ్వ కోటీశ్వరుడివి అయ్యేవాడివి. ఒక్క మామిడికాయ ఏం ఖర్మ. తోటనే కొనగలిగేవాడివి. అనవసరంగా వాటి విలువ తెలియక వృధా చేశావ్ఞ అని చెప్పాడు. ఇది విని బాధపడుతున్న వీరయ్యను, బంగారయ్య ఓదార్చి ఈ రాయినైనా సద్వినియోగం చేసుకో అన్నాడు. అది విని వీరయ్య ఆ రాయిని తెలివిగా వాడుకోవాలని నిశ్చయించుకున్నాడు.
అదీ కథ బావ్ఞందా. ఈ కథలో రాళ్లు అంటే రోజూ మనం వృథా చేసే సమయం. రోజుకుండే 24 గంటలు. 24 రాళ్లు అన్నమాట. పనికొచ్చే విషయాలకి వీటిని ఉపయోగిస్తే మంచి అభివృద్ధి సాధిస్తాం. లేదా వృధా అయ్యి అవసరానికి విలువైన సమయం మిగలదు. గంటల తరబడి స్నేహితులతో కలసి కబుర్లు, ఆటలు, తగువ్ఞలు ఇవన్నీ మామిడికాయల్లా ఆకర్షించి మన సమయాన్ని పాడుచేస్తాయి. కనుక సమయాన్ని వృధా చేయకూడదు.