Search This Blog

Chodavaramnet Followers

Monday, 20 May 2013

100% BEAUTIFUL WOMEN TIPS


మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించేది నుదుటి మీద వుండే బొట్టు. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక. నుదుటి మీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏవిధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా వుంటుందో తెలుసుకొని ఆ విధంగా పెట్టుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. 1. శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి. నుదురు చిన్నగా వుంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు. ఆటీన్‌ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. నుదురు పెద్దగా వుండేవారు బొట్టును కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా వుంటుంది.


2. అలాగే శరీర ఆకృతిని, శరీర ఛాయను బట్టి కూడా బొట్టును సెలక్ట్‌ చేసుకోవాలి. అప్పుడే ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లని శరీరఛాయ కలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా వుంటుంది. చామనఛాయ లేదా అంతకన్నా కాస్త రంగు తక్కువగా వున్నవారైతే పింక్‌, ఆరంజ్‌, గంధపురంగు, లేత గులాబిరంగు, ఎరుపురంగు బొట్టు కళగా వుంటాయి. 3. కళ్ళు పెద్దవిగా వుంటే పెద్ద బొట్టు. చిన్నగా వుంటేకొంచెం చిన్నసైజు బొట్టు శోభాయమానంగా వుంటుంది. నుదురు పెద్దగా వున్నవారు పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా వున్న విషయం అంతగా తెలీదు. కళ్ళు చిన్నగా ఉన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్‌ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్య వయస్సు వారికి ఎరుపు,పింక్‌ వంటి రంగులు, గుండ్రటి బొట్టు నిండుదనాన్నిస్తుంది. 4. పొట్టిగా వున్న వాళ్ళు పొడుగు బొట్టు పెట్టుకొంటే అందంగా, హుందాగా కనిపిస్తారు.


చేతులు అందంగా వుండాలంటే : లి గోరువెచ్చని నీటిలో టీ స్పూన్‌ వెనిగర్‌ లేదా టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి ఆ నీటితో క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేతులను శుభ్రం చేసుకుంటే అందమైన చేతులు మీ సొంతమవుతాయి. లి రెండు టీ స్పూన్ల బాదం నూనెలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి చేతులను, అరచేతి వేళ్లను క్రమం తప్పకుండా మసాజ్‌ చేసుకుంటే చేతులు గులాబిరేకుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి.లి అయిదారు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌లో చిటికెడు చందనం పొడి కలిపి ఈ మిశ్రమంతో చేతులు, అరచేతి వేళ్లని వారానికి రెండుసార్లు మసాజ్‌ చేసుకుంటే అందమైన, ఆకర్షణీయమైన చేతులు మీ సొంతం కాగలవు.