Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 10 April 2013

LORD JESUS CHRIST


పరలోక రాజ్యము ప్రభువు తీర్పు


ఈ ఉపమానము ప్రభువు మహిమలో వచ్చినపుడు ప్రజలకు తీర్పు చెప్పు విధానము వివరిం చబడింది. ప్రభువు మహిమ సింహాసనాసీనుడై యుంటాడు. దేవదూత గణములు ఆయన తో ఉంటారు. సమస్త జనములు ఆయన యెదుట కూడుదురు. గొల్లవాని వలె మేకలలో నుండి గొఱ్ఱెలను వేరుపరచి, గొఱ్ఱెలను కుడివైపునను, మేకలను ఎడమ వైపునను నిలువబెట్టును. ఇది తీర్పు సభ, గొఱ్ఱెలు దేవుని చేత ఆశీర్వదించబడినవారు. మేకలు శపించబడినవారు.

కుడి వైపునున్న వారిని చూచి, ‘‘నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టి నది మొదలుకొని మీ కోరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి’’ మత్తయి 25:34. వీరు ఆకలిగొన్న వారికి ఆహారము, దప్పిగొన్నవారికి దాహము, పరదేశులకు ఆశ్రయ ము, దిగంబరులకు బట్టలు, రోగులను దర్శించడము, చెరలోనున్నవారిని సందర్శించుట చేసిన వారు. తన ఎడమ వైపునున్న వారిని చూచి, ‘‘శపింపబడిన వారలారా, నన్ను విడిచి ఆపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి’’ (మత్తయి 25:41). వీరు దేవుని పేరిట అల్పులైన సోదరులకు పైన ఆశీర్వదింపబడినవారు చేసినట్టూ ఏమి చేయలేదు. ‘‘వారికి చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను’’ (మత్త 25:45). మనము ఆరాధించే దైవము యేసు క్రీస్తు ప్రభువు పేదలపాలిట పెన్నిధి, ఆహారము, బట్ట, ఆశ్రయము లేనివారికి దేవుడే ఆశ్రయము. ప్రభువా! తరతరములకు నివాసము నీవే.ప్రార్థన: యేసు ప్రభూ! రుూ లోకములో పైలోకములో నివాసాలిచ్చినందుకు స్తోత్రములు.