Search This Blog

Chodavaramnet Followers

Monday, 4 February 2013

MODERN FASHION DESIGNS FROM MASTERWEAVERS

రమణీయ సోయగాలు

నిత్యం ఆధునిక వస్తధ్రారణలో కనిపించే అమ్మాయిలెైనా సరే పండుగలు, పెళ్ళిళ్లలో మాత్రం సంప్రదాయ వస్త్రాలతో ఆ సందడిని రెట్టింపు చేస్తారు. ఇది పెళ్ళిళ్ల సీజన్‌... దీంతో అమ్మాయిలు ఇప్పటి నుండే తమ వార్డ్‌రోబ్‌ను నింపే పని మొదలు పెట్టేస్తున్నారు. సంప్రదాయ వస్త్రాల సేకరణలో తలమునకలవుతున్నారు. అందుకోసమే ఈవారం ఇక్కడ ఇచ్చిన ఆధునిక డిజెైన్లను పరిచయం చేస్తున్నాం... సంప్రదాయ వేడుకలెైనా.. లేదా ప్రత్యేక సందర్భం ఏదెైనా సరే అందుకు తగినవిగా సంప్రదాయాన్ని కురిపిస్తూ... హుందాతనాన్ని ఇనుమడించేవిగా వున్నాయి. మాస్టర్‌ వీవర్స్‌వారు విడుదల చేసిన ఈ కొత్త కలెక్షన్‌ను మీరూ చూడండి.

dress

మంగళగిరి ఫ్యాబ్రిక్‌ టాప్‌పెై నెక్‌ యోక్‌ దగ్గర మల్టీ కలర్‌ మంగళగిరి ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్స్‌, కలంకారి ఫ్యాబ్రిక్‌ను జతచేసి డిఫరెంట్‌ స్టైల్లో ఫ్యాచ్‌ చేశారు. మిరర్‌ వర్క్‌, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ చేశారు.కలంకారి ఫ్యాబ్రిక్‌ను బాటమ్‌గా వాడారు. మల్‌ ఫ్యాబ్రిక్‌ను దుపట్టాగా ఇవ్వడంతో సూపర్బ్‌గా కనిపిస్తుందీ డ్రెస్‌.
ధర : రూ.1025


ప్లెయిన్‌ మంగళగిరి ఫ్యాబ్రిక్‌పెై నెక్‌ యోక్‌ దగ్గర పెన్‌ కళంకారి డిజెైన్‌ను అటాచ్‌ చేసి మిరర్‌ వర్క్‌, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీలతో పాటు హ్యాండ్‌ ఆప్లిక్‌ వర్క్‌ చేశారు. బాటమ్‌గా కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఇవ్వడంతోపాటు షిఫాన్‌ దుపట్టాను జత చేయడంతో అద్భుతంగా కనిపిస్తుందీ డ్రెస్‌.
ధర : రూ.1225


మంగళగిరి కాటన్‌ ఫ్యాబ్రిక్‌ ఆల్‌ఓవర్‌ పెన్‌ కలంకారి డిజెైన్‌‌‌ను ప్యాచ్‌ చేశారు. మంగళగిరి స్టైప్స్‌ ఫ్యాబ్రిక్‌ను బాటమ్‌గా వాడారు. టాప్‌పెై హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో పాటుగా షిఫాన్‌ చు న్నీకి మంగళగిరి ఫ్యాబ్రిక్‌ను ప్యాచింగ్‌ చేశారు. ఇన్ని హంగులతో చూడ రమణీయంగా వుందీ డ్రెస్‌.
ధర : రూ.1975

డిజైన్స్‌: మాస్టర్‌ వీవర్‌
దిల్‌సుఖ్‌నగర్‌ : 04024050422
బంజారాహిల్స్‌ : 04023386437
ఫోటోలు : అరుణ స్టూడియో
వెబ్‌సైట్‌ : www.masterweaver.in