Search This Blog

Chodavaramnet Followers

Monday, 4 February 2013

BEAUTY HAIR CARE TIPS USING NIMBU, GREEN LEAVES ETC AVAILABLE IN UR KITCHEN


జుత్తు అందాన్ని రెట్టింపు చేస్తుంది అన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అందమైన జుత్తును సొంతం చేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. జుత్తుని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత పోషణ చేసినా ఊడిపోవడం అన్నది తరచూ జరుగుతూనే వుంటుంది.అలా ఊడిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. వీటివల్ల ఒత్తుగా కూడా పెరుగుతుంది.


ఉసిరికాయలను ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. ఎండిన ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి ఒక రాత్రంతా ఉసిరి ముక్కలను నూనెలో ఉంచి, మరుసటి రోజు వాటిని తీసేసి ఆ నూనెను తలకు అప్లయి చేసుకోవాలి. ఈ నూనెను కొన్ని రోజుల పాటు వాడితే జుత్తు ఊడిపోవడం తగ్గుతుంది. అలాగే బలంగా పొడువుగా పెరుగుతుంది.

ఉసిరికాయలను మెత్తగా చేసుకుని కొద్దిగా రసం పిండి దానికి సమానంగా నిమ్మరసం జత చేసి ఈ మిశ్రమాన్ని షాంపూతో పాటు తలకి అప్లయ్‌ చేయాలి. తరువాత కొద్ది సేపుఆగి తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ప్రతిరోజూ కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుత్తుకు అప్లయ్‌ చేయాలి. దీని వలన మంచి నిగారింపు వస్తుంది. ఊడటం తగ్గుతుంది. 

కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన కూడా జుత్తు ఊడటాన్ని నిరోధించ వచ్చు.



నిమ్మకాయ గింజలు, కొద్దిగా మిరియాలు కలిపి ముద్దుగా నూరుకుని ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి ఆరిన తరువాత స్నానం చేయాలి. 

పెసలు ఉడికించి ముద్దగా చేసి దానిలో కొద్దిగా మెంతిపొడి కలిపి ఈమిశ్ర మాన్ని తలకు పట్టించి ఆరిన అనంతరం తల స్నానం చేయాలి. ఈ చిట్కా జుత్తు ఊడటాన్ని బాగా నిరోధిస్తుంది. 

ఒక గ్రాము మిరియాల పొడి, వందగ్రాముల పెరుగులో కలిపి ఈమిశ్ర మాన్ని తలకుపట్టించి, ఆరిన తరువాత తల స్నానం చేయాలి. రోజూ బాదం నూనెతో కుదుళ్ళ నుండి మూడు సార్లు మర్దన చేసుకోవాలి. 

బాదం నూనె హెయిర్‌ ఫాల్‌ని బాగా తగ్గిస్తుంది. ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు కూడా మృదుత్వం సంతరించుకుంటుంది.