Search This Blog

Chodavaramnet Followers

Monday, 19 September 2016

TENSION RELIEF FOOD ITEMS HEALTH TIPS IN TELUGU


 ఒత్తిళ్లను తగ్గించే ఆహారం

మానసిక ఒత్తిళ్లయినా శారీరక ఒత్తిళ్లయినా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఈ ఒత్తిళ్ల వెనుక చాలాసార్లు రక్తపోటు పెరగడం కూడా కారణంగా ఉంటుంది. అందుకే దాన్ని నియంత్రించే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అటువంటి ఆహార పదార్థాల గురించి కొలంబియా యూనివర్సిటీకి చెందిన మానసిక వైద్యుడు డాక్టర్‌ డ్రీవ్‌ రేమ్‌సే ఇటీవల వివరించారు.

* ఒక కప్పు ఉడికించిన ఓట్స్ ‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణం కావడంతో పాటు వీటికి రక్తపోటును అస్తవ్యస్తం కాకుండా నిలబెట్టే లక్షణం ఉంది. అయితే, ఓట్లలో దాల్చిన చెక్క పొడిని, ఒక చెంచా తేనె కూడా కలిపి తీసుకుంటే తీపి పట్ల ఉన్న కోరికా తీరుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

• బాదాం గింజలతో చేసిన డార్క్‌ చాక్లెట్లలో సె్ట్రస్‌ హార్మోన్లను తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మందులతో సమానంగా పనిచేస్తుంది. బాదాం పప్పులో గొప్ప శక్తినిచ్చే ప్రొటీన్‌ కూడా ఉంది. ఇది మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌కు ఎంతో మంచి చేస్తుంది. అలాగే డిప్రెషన్‌ను తగ్గించే శక్తి కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌కు ఉంది.

* ఆలివ్‌ నూనెతో గోబీ ఆకుల చిప్స్‌ చేస్తే వాటిలో మనిషిని ఉల్లాసపరిచే సెరెటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. దీనికి తోడు కెరోటెనాయిడ్‌ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉత్పన్నమవుతాయి. మనిషిలో ఇవి ఆశావహ దృక్పథాన్ని బాగా పెంచుతాయి.

* సోయా పాలతో చేసిన కాఫీ తాగితే, అందులో ఉండే ఫోలేట్‌ నిల్వల వల్ల మనసును ప్రశాంతపరిచే సెరటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. కాఫీతో కోకో పౌడర్‌ కలిపి తీసుకుంటే మనిషికి మేలు చేసే డొపామిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. అలాగే పండిన అరటి పండ్లు తీసుకుంటే అందులో ఉండే పొటాషియంతో అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.