Search This Blog

Chodavaramnet Followers

Thursday, 7 January 2016

BRIEF HISTORY OF Gajendragarh IN KARNATAKA


గజేంద్ర గడ - వీడని మిస్టరీ !

ఉత్తర కర్నాటక జిల్లా అయిన గడగ్ ఒక ప్రసిద్ధి చెందిన ఆకర్షణీయ ప్రదేశం. పర్యటనలు చేసే వారు తప్పక చూడాలి. ఇది ఒక పర్యాటక ప్రదేశమే కాక, ఫిలిం షూటింగ్ లకు కూడా ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో అనేక కన్నడ సినిమాలు షూట్ చేసారు. గడగ్ నుండి 54 కి. మీ. ల దూరం లో వున్న గజేంద్ర గదగ్ బెంగుళూరుకు వాయువ్యంగా 4 11 కి. మీ. ల దూరంలో వుంటుంది. ప్రదేశం చుట్టూ ఎన్నో సహజ అందాలు. ఇక్కడ కళాక్షేత్ర అనే ఒక పేరొందిన టెంపుల్ కలదు. ఈ టెంపుల్ ను దక్షిణ కాశి అని అంటారు. ఈ గుడిని ఒక కొండపై నిర్మించారు. ఒక్క రోజు సందర్శనలో ఈ ప్రదేశం అక్కడకల విండ్ మిల్స్ తో సహా చూడవచ్చు.

అతి పెద్ద వరుసల మెట్లు మిమ్ములను కొండపై గల టెంపుల్ కు చేరుస్తాయి. ఈ ఆలయంలో కల శివలింగం వెలిసినదని చెపుతారు. ఈ టెంపుల్ ఆవరణలోనే వీరభద్ర స్వామి టెంపుల్ కూడా కలదు. గుడికి సమీపంలో వెలుపలి వైపుగా నిరంతరం నీరు వుండే ఒక కొలను లేదా దిగుడు బావి కలదు. దీనిని అంతర గంగ అంటారు. ఈ నీరు ఎక్కడనుండి ప్రవహిస్తున్దనేది ఒక మిస్టరీ. పక్కనే కల ఒక రావి చెట్టు నుండి నీటి బిందువులు నిరంతరం కొలనులోకి పడుతూంటాయి.

* అసలు మిస్టరీ !

ఇక అసలు మిస్టరీ లోకి వస్తే.... ప్రతి సంవత్సరం వచ్చే కన్నడ ఉగాది సంవత్సరం మొదటి రోజున కొన్ని మిస్టరీ లు జరుగుతాయి. ఉగాది పండుగ ముందు రోజు టెంపుల్ పూజారి తన డ్యూటీ గా ఒక హుక్కా మరియు కొంత సున్నపు నీరు అక్కడ వుంచుతాడు. మరుసటి రోజు ఉదయం చూస్తె, ఎవరికీ అర్ధం కాని రీతిలో టెంపుల్ గోడల లోపలి భాగం అంతా సున్నం వేయబడి వుంటుంది. హుక్కా ఉపయోగించిన నిదర్శనాలు కనపడతాయి. దీని పట్ల ఆసక్తి చూపిన కొంతమంది ఆధునిక పరిశోధకులు హుక్కా లో వేసిన సున్నం ఎలా గోడలకు వేయబడుతోందని తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కాని అంతు పట్టలేదు. ఒకప్పుడు ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో ఒక పెద్ద గంట కలదు. ఈ గంటను ఒక కుంగ్ ఫు చేసే వ్యక్తి బలంగా మోదగా, ఆ గంట అప్పటి వరకూ ఎవరూ విననంత శబ్దంతో గంటలు కొడుతూ గాలిలోకి లేచి మాయం అయిపోయినదని చెపుతారు. ఆ గంట ఆ ప్రదేశం నుండి మాయం అయిన తర్వాత ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి వచ్చిందని చెపుతారు.

ఈ ప్రదేశంలో నిర్మించిన విండ్ మిల్స్ నిరంతరం పని చేయటంతో ఈ ప్రాంతంలోని వన్య జీవులు చాలా వరకూ అదృశ్యం అయిపోయాయి గజేంద్ర గడ అక్కడ కల కోట కు ప్రసిద్ధి. ఒకప్పుడు ఈ ప్రదేశం కొరకు నిజాములు, టిప్పు సుల్తాన్ ల మధ్య ఒప్పందం జరిగింది. అందమైన ఆకర్షనీయం అయిన గజేంద్ర గడ కోట తప్పక చూడదగినది. ఈ ప్రదేశంలో ఇంకా ఇతర చారిత్రక ప్రదేశాలు కూడా కలవు.

* ఇతర ఆకర్షణలు

సూది - గజేంద్ర గడ కు తూర్పు దిశగా ఈ ప్రదేశం కలదు. ఇక్కడ రెండు గోపురాలు కల మల్లిఖార్జున టెంపుల్ వుంటుంది.

ఇటాగి భీమామ్బిక - గజేంద్ర గడ కు 13 కి. మీ. ల దూరంలో కల ఈ ప్రదేశంలో భీమామ్బిక గుడి కలదు.

బాదామి - ప్రసిద్ధి చెందిన బాదామి బనశంకరి టెంపుల్ గజేంద్ర గడ కు 42 కి. మీ. ల దూరం లో కలదు. హై వే నెం. 63 ద్వారా ప్రయాణించాలి.

ఐహోలె - గజేంద్ర గడ కు 40 కి. మీ. ల దూరం లో ఉత్తర దిశగా కల ఈ ప్రదేశం కర్నాటక లోని ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశాలలో ఒకటి.

పట్టడక్కాల్ ఈ ప్రదేశం గజెంద్రగడ కు 43 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రదేశంలో మీరు ఎక్కడా చూడని అద్భుతమైన శిల్ప సంపద చూడవచ్చు.

మహాకూట - మహాకూట గజేంద్ర గడ కు 50 కి. మీ. ల దూరం. ఇక్కడ అనేక టెంపుల్స్ కలవు.