Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Song Lyrics - Telugu. Show all posts
Showing posts with label Song Lyrics - Telugu. Show all posts

Wednesday, 14 September 2016

LALITHA GEETHAM ON LORD SRI KRISHNA - VIDEO CREATED BY SRI Vinjamuri Venkata Apparao GARU


లలిత గీతం

సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు

పాట పాడుమా..ఆఅ..
పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆఅ...
శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె..ఏ..
శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె
సదమల హృదయా నిన్ను
సన్నుతింతు వరనామము
పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా
సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా..ఆఅ..
సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా
దానికంతమగు గానము
పాటకూర్చి పాడుమా
పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆ..ఆ..

THANKS TO
SRI 
Vinjamuri Venkata Apparao
for his video


Tuesday, 8 December 2015

LORD SWAMY AYYAPPA BHAKTHI SONGS LYRICS IN TELUGU


శబరిమలై నౌక సాగీ పోతున్నది
పల్లవి : శభరిమలై నౌకా సాగీ పోతున్నది 
అయ్యప్ప నౌక సాగీ పోతున్నది 
నామంబు పలికితే నావ సాగి పోతుంది 
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా 
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది ||శరణం||
కదలండి బాబు మెదలండి బాబు
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||

Saturday, 27 June 2015

NAG'S BLOCK BUSTER MOVIE - NIRNAYAM - HELLO GURU PREMA KOSAME - POPULAR TELUGU SONG LYRIC


హలో గురు ప్రేమ కోసమేరోయ్.. జీవితం
మగాడితో ఆడదానికేలా.. పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే 
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్ని.. "హలో గురు"

ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి
చదువు సంధ్య కల్గినోణ్ణి చౌకబేరమా..
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా..
నా కన్న నీకున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మ
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ
నా కంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా..
ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చార్మింగ్
ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే.. వై నాట్ "హలో గురు"

కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే..
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా..
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు..
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంట
అభిమన్యుడు శశిరేఖ అందాలా జంటంటా..
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా
అమీ తుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కపోత.. ఆర్ యు రెడీ "హలో గురు"

గానం: ఎస్.పి.బాలు
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల

Sunday, 13 July 2014

TELUGU BHAKTHI SONG LYRICS


వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆల్బం కోసం వ్రాసిన పాటల్లో ఇదొకటి.
వర్ధమాన గాయకి ‘ప్రణవి’ ఈ పాటను పాడారు.

రాజేశ్వర రాచ నగరి వేములవాడ
రావణారి శ్రీరాముని నిలయం కూడా
శివ భక్తుడు శ్రీ రాముడు రామ భక్తుడైన శివుడు
కొలువిక్కడ దీర్చినారు కొలిచిన దరి జేర్చు వారు ||

ఎడమ చేత విల్లు,వింటి పక్కన ఒక హరివిల్లు
హరుని విల్లు విరిచిన హరి వరియించిన సిరి జల్లు,
గొడుగుగ, ఒక పడకగ, అడవులకు తోడు నడకగా
నడిచిన తమ్ముడు నిలిచిరి శ్రీ రాముని కిరుపక్కల ||

కుదురుగ తనకెదురుగ తన దాసజనుల గురుతుగ
ఆంజనేయుడై కొలిచిన ఆది పరమ శివుడట,
తమ్ముడితో, అమ్మడితో, కరముల విల్లమ్ములతో,
అంజలితో హనుమతో, అయోధ్య విభుని కొలువిట ||

***V.V.V. Prasada Rao