Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Deepavali Festival Telugu Articles Collection. Show all posts
Showing posts with label Deepavali Festival Telugu Articles Collection. Show all posts

Saturday, 29 October 2016

WHY GODDESS LAKSHMI PUJA TO BE PERFORMED ON DEEPAVALI FESTIVAL DAY


దీపావళి రోజున లక్ష్మీపూజ ఎందుకు చేయాలంటే..?

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అలాంటి దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. 

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో.. తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా.. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. నీవు అనుకున్నట్లు శ్రీహరి అంత సంకుచిత మనస్కుడు మాత్రం కాదు. 

"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.


Wednesday, 22 October 2014

THE HISTORY OF DEEPAVALI FESTIVAL - ARTICLE ABOUT DIWALI CELEBRATIONS IN INDIA


జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి
భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!
దీపావళి మూలాలు
దక్షిణాదివారికి దీపావళి మూడురోజుల ముచ్చట. ఉత్తర భారతాన అది అయిదురోజుల సందడి.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి, మర్నాడు అమావాస్య, మూడోరోజు కార్తిక శుద్ధపాడ్యమి- దక్షిణ దేశాన పండుగరోజులు. వీటిలో మొదటిది నరకచతుర్దశిగాను, రెండోది దీపావళి అమావాస్యగాను, మూడోరోజును బలిపాడ్యమిగాను పాటించడం దక్షిణాదిన ఆనవాయితీగా వస్తోంది. అయితే, బలిచక్రవర్తి కథ మినహాయించి, మిగిలిన వాటికి ధర్మశాస్త్ర ప్రమాణాలు లేవు. జనసామాన్యంలో నరకాసుర సంహారగాథ, బలిచక్రవర్తి రాజ్యదానం, విక్రమార్కుడి పట్టాభిషేక ఉదంతాలు- దీపావళితో ముడివడిఉన్నాయి. కార్తిక పాడ్యమినాడు విక్రమార్కుడి పట్టాభిషేకం జరగడం, నాటి నుంచే విక్రమశకం ఆరంభం కావడంతో, ఆ కథకు కొంతలో కొంత దీపావళితో సంబంధం ఉందనుకున్నా- నరకాసుర వధకూ దీపావళికీ ఏరకంగానూ లేదు.

ఉత్తర భారతం విషయానికివస్తే- అటు చతుర్దశికి ముందు రోజు ధన త్రయోదశి, ఇటు పాడ్యమి మర్నాడు యమద్వితీయ చేరి, దీపావళి అయిదు రోజుల పండుగ అయింది. ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ... మొత్తం అయిదు రోజులూ వరసగా పండుగలు జరుపుకొంటారు. ధనత్రయోదశినే 'ధన్‌తేరస్‌' అనీ, యమత్రయోదశి అనీ వ్యవహరిస్తారు. అలాగే యమ ద్వితీయను భ్రాతృవిదియగా పిలుస్తారు. ఉత్తరాదిన ముఖ్యంగా రామభరత సమాగమ ఉదంతం దీపావళితో ముడివడి ఉంది. రావణ సంహారానంతరం, రాముడు అయోధ్యకుచేరి, భరతుణ్ని కలిసింది దీపావళి రోజుల్లోనని వారి నమ్మకం. దాన్ని 'భరత్‌మిలాప్‌' పేరుతో జరుపుకోవడం ఉత్తరాదివారి ఆచారం.
మనవైపు నరకుడు, బలి, విక్రమార్కుడి కథలతో దీపావళికి సంబంధం కలిపే బలమైన శాస్త్ర ప్రమాణాలు లేనట్టే- రామభరత సమాగమాన్ని దీపావళికి ముడివేసే గట్టి ఆధారాలూ లేవు. గోవింద రాజీయ వ్యాఖ్య ప్రకారం- ఫాల్గుణ అమావాస్యనాడు రావణ వధ జరిగిందని వాల్మీకి రామాయణం చెబుతోంది. అయోధ్యకు తిరుగు ప్రయాణమై రాముడు, చైత్రశుద్ధ పంచమినాటికి భరద్వాజ ఆశ్రమానికి చేరాడు. అదేరోజు హనుమ అయోధ్య వెళ్లి భరతుడితో 'రేపు పుష్యనక్షత్ర పవిత్రయోగంలో నీవు రాముణ్ని దర్శించగలవు' అని చెప్పాడు. వీటిని ప్రమాణంగా తీసుకుంటే- భరత్‌మిలాప్‌ చైత్రమాసపు గాఢపరిష్వంగమే తప్ప, ఆశ్వయుజంనాటి ఆలింగనం కాదు. కనుక దీపావళితో దానికి ఎలాంటి ప్రమేయం లేదు. ఆచార వ్యవహారాలను, వ్రత గ్రంథాల వివరణను పరిశీలిస్తే మాత్రం- దీపావళికి దేశమంతటా ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణాల్లో మొదటిది పర్వదిన సంప్రదాయం. భారతీయుల ప్రతి శుభ సందర్భంలోనూ అభ్యంగనస్నానం, దీపారాధనం తప్పనిసరి ఆచారాలు.ముఖ్యంగా నరకచతుర్దశి, దీపావళి నాడు. చతుర్దశినాడుగాని, అమావాస్యనాడుగాని స్వాతీనక్షత్రం రావడం మరింత ప్రత్యేకం. అదిచాలా యోగదాయకం. స్వాతీనక్షత్రం కలిస్తేనే- దీపావళిగా పిలవాలని ఒక సిద్ధాంతం. స్వాతీనక్షత్రం వాయుదేవతాకం. రవిచంద్రులు స్వాతీ నక్షత్రయుతులు కావడాన్ని (ఈ ఏడాది అవుతోంది) తేజోవాయు సంయోగకాలంగా భావిస్తారు. అదే కారణంగా జలతత్వానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఆ కాలంలో తుపాన్లు రావడమూ పరిపాటి. ఆ వేళ- అభ్యంగ స్నాన విశేష ఫలాన్ని మనం వూహించుకోవచ్చు. రెండోది- దీపావళి దేశ సమైకత్యకు ప్రతీక! హిందువులకు దివ్వెల పండుగ. క్రైస్తవుల కొవ్వొత్తుల పండుగ (కాండిల్‌ ఫెస్టివల్‌)లో, మహమ్మదీయుల దీపోత్సవ వూరేగింపు (షబే బరాత్‌)లో కూడా దీపాలకు విశేష పాత్ర ఉంది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనాడు . మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు .
భూదేవి- మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ -సత్యభామ గా జన్మిస్తారు . అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుడని తెలిసుకొన్న సత్యభామ ...తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.
దీపావళి అమావాస్య : ఇంకా కొన్ని సందర్బాలు ->
రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.
ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.
మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.
నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.



Tuesday, 21 October 2014

DEEPAVALI FESTIVAL TELUGU ARTICLE ABOUT GODDESS SRI MAHA LAKSHMI AND LORD SRI MAHA VISHNU


దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యా స్తమయసమయం, అనగా సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది.
'దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము''
''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం, శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు, చీకట్లు పోగొట్టి కాని, ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయా మయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట.
'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన: ''ఆ అగ్నిదేవుని మన ఇంటి యందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే, ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం!!!
''సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ 
గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతి మిరాపహమ్‌''
ఇంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవటం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెపుతారు. చతుర్మాస్యం పూర్తి అయి శ్రీమహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెపుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికీ ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్రదర్శనం చేయాలంటారు. ఈనెల అంతా కృత్తికల పేరు గలది కదా! ఆ వివరాలు ఉపొద్ఘాతంలో చెప్పుకున్నాం. తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసాధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రం లక్ష్మిని ఆరాధించాలి.