Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Lord Hanuman Prayers. Show all posts
Showing posts with label Lord Hanuman Prayers. Show all posts

Wednesday, 16 November 2016

BIRTH STORIES OF LORD ANJANEYA SWAMY


హనుమంతుని జన్మరహస్యాలు

హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది.

శివమహాపురాణంలోని కథ :
పూర్వం శివుడు రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు. సప్తమహర్షులు దానిని సాదరంగా ఒకచోట పొందుపరిచారు. కొన్నాళ్ల తరువాత ఆ శివుని వీర్యాన్ని.. గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెడతారు. ఫలితంగా మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వానరదేహంతో హనుమంతుడు జన్మించాడని శివపురాణంలో తెలపబడింది.
ఆ విధంగా హరుని అంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడిగా, శివసుతుడిగా శివపురాణంలో వర్ణించబడింది. త్రిపురా సంహారంలో విష్ణువు, పరమశివుడికి సహకరించినందువల్ల ఆయన కృతజ్ఞుడై.. హనుమంతుడిగా అవతరించాడు. అలాగే రావణుడిని సంహరించడానికి శ్రీరాముడికి సహకరించాడని ఈ పురాణంలో పేర్కొనబడింది.

గ్రంథంలోని కథ :
పూర్వం ఒకనాడు రాక్షసులను సంహరించడం కోసం విష్ణువు, పరమశివునికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచనమేరకు శివుడు త్రిమూర్తుల తేజస్సును మింగుతాడు. ఆ తేజస్సు కారణంగా పార్వతీదేవి, శివుని వీర్యాన్ని భరించలేక.. అగ్నిదేవునికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా ఆ వీర్యాన్ని భరించలేక వాయుదేవునికి అప్పగిస్తాడు. అప్పుడు వాయుదేవుడు ఆ వీర్యాన్ని ఒక మండురూపంలో మలిచి.. పుత్రిడికోసం ప్రార్థిస్తున్న అంజనాదేవికి ఇస్తాడు.

అంజనాదేవి ఆ పండును తినడంతో గర్భం దాల్చి, కాలక్రమంలో ఆంజనేయునిని జన్మనిచ్చింది. వాయుదేవుడిచ్చి ప్రసాదంతో ఆంజనేయుడు జన్మించడంతో వాయునందనుడు అనే పేరు కలిగిందని ఈ సంహితంలో వివరించబడి వుంది. భగవంతుని అనుగ్రమం వల్లే పుట్టాడు కనుక.. ఆమెకు కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి పేర్కొన్నట్టు ఈ గ్రంథంలో సూచించబడింది.

రామాయణంలోని కథ :
దేవలోకంలోని వుండే పుంజికస్థల అనే ఒక అప్సరస.. బృహస్పతి శాపంవల్ల భూలోకంలోని వానర ప్రభువైన కుంజరునికి అంజనాదేవిగా జన్మించింది. యుక్తవయస్సు వచ్చిన తరువాత ఆమె వానరరాజైన కేసరికి భార్య అయింది. ఒకనాడు కేసరి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లేముందు.. అంజనాదేవిని వాయుదేవునికి అప్పగించి వెళ్లిపోతాడు.

ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఒకరోజు వాయుదేవుడు, అంజనాదేవి అందానికి మోహితుడై ఆమెను కౌగిలించుకున్నాడు. వాయుదేవుడు మనస్సుతో ఆమెను పూర్తిగా అనుభవించాడు కనుక.. ఆమె ఏకపత్నీ వ్రతం భంగం కాలేదని ధైర్యం చెప్పి.. పరాక్రమవంతుడైన ఒక పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చి, తృప్తిపరిచాడు. దాంతో అంజనాదేవి ఎంతో సంతోషించి.. వైశాఖ బహుళ దశమినాడు ఒక గుహలో ఆంజనేయుడిని ప్రసవించింది.

హనుమంతుని పేరు :
పూర్వం ఒకనాడు ఒక బాలుడు (హనుమంతుడు) ఉదయించే సూర్యుడిని చూసి తినే పండు అనుకుంటాడు. దానిని తినాలనే కోరికతో ఆకాశంవైపు 300 యోజనాలు ఎగిరి.. సూర్యతేజస్సును ఆక్రమించుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు కోపాద్రిక్తుడై తన వజ్రాయుధంతో ఆ బాలుడిని కొడతాడు. ఆ దెబ్బతో ఆ బాలుడి హనువు (గడ్డం) విరిగింది. దాంతో ఆ బాలుడి పేరు హనుమంతుడిగా పిలవడం జరిగింది. ఇలా ఈ విధంగా ఆయన పుట్టుకకు సంబంధించిన కథలు వున్నాయి.

Tuesday, 19 April 2016

Thursday, 28 January 2016

Wednesday, 2 December 2015

DASA BHUJA HANUMAN


భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి కీర్తికెక్కాడు. అలాగే సాధారణంగా మనం హనుమంతుని రాముని పాదాల వద్దో, సంజీవిని పర్వతాన్ని ఎత్తుకునో, రామలక్ష్మణులను తన భుజాలమీద ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగానో దర్శనమిస్తారు. కానీ మూడు కళ్ళు, పది భుజాలు కలిగిన ఆంజనేయస్వామిని ఎప్పుడైనా చూసారా.హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం -37 .? ఆంజనేయస్వామి నుదురుపైన మూడో కన్నుతో, పది భుజాలతో మనకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న ఆలయంలో భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన తరువాత నారదుడు రాముణ్ణి దర్శించుకుని "రామా ... లంక నాశనముతో మీ యుద్ధము ముగియలేదు. రావణుని వారసులు ఇంకా ఉన్నారు, వారు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాచుకుని వున్నారు. వారు ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. మీరు వారి తపస్సు పూర్తీ కాకమునుపే వారిని సంహరించాలి'' అని వేడుకున్నాడు. దానికి రాముడు "నారదా ... రామావతారంలో నా కర్తవ్యమ్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలిస్తున్నాను కాబట్టి ఇంకెవరినైనా ఎంపికచేయండి'' అని బదులిచ్చాడు. రాక్షస సంహారానికి ఆంజనేయస్వామే తగినవాడని అందరూ నిర్ణయించడంతో విష్ణుమూర్తి తన శంఖుచక్రాలను, పరమశివుడు తన మూడో కంటిని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని ఇతర దేవతలనుంచి పది ఆయుధాలు పొంది హనుమంతుడు దశభుజుడయ్యాడు. పరమశివుని మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. హనుమంతుడు రాక్షస సంహారణానంతరం విజయంతో తిరిగి వచ్చి ఆనందమంగళం ప్రాంతంలో వెలిశాడు. భక్తులు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. రాక్షస సంహారంతో ఆంజనేయుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

Tuesday, 18 August 2015

Friday, 5 December 2014

ARTICLE ABOUT SRI PANCHAMUKHA HANUMATHKAVACHAM - SRI SUDARSANA SAMHITHOKTHAM IN TELUGU - LORD HANUMAN BHAJANS AND PRAYERS IN TELUGU


శ్రీ పంచముఖ హనుమత్కవచం

శ్రీ సుదర్శన సంహితోక్తం


శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !
దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం
వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం
పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం
పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం
శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే
యది నశ్యతి నశ్యతి శత్రుకులం
యది ముంచతి ముంచతి వామలతా!!
ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
ఏవం హృదయాదిన్యాసః!
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
అథ మంత్ర :-
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా! ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా! ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా! ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా! ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా! ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా! భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!

ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!

Tuesday, 2 December 2014

INFORMATION ABOUT REDUCING SANI DHOSHAM WITH LORD HANUMAN PUJA


పంచముఖ హనుమాన్

ఒక సారి "శని" ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు 'శనివారం' ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి "పంచముఖ హనుమంతుడు"గా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

Wednesday, 26 November 2014

ARTICLE ABOUT IMPORTANCE OF LORD HANUMAN - LORD HANUMAN PRAYER IN TELUGU


ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం
విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం
ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం
నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం
ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.
ధ్యాయేద్బాల దివాకర ద్యుతి నిభం దేవాది దర్పాపహం
దేవేంద్ర ప్రముఖా మరస్తుత పదం రోగాది శోకాపహం
మౌంజీ రత్న విచిత్ర కుండల ధరం కౌపీన కృష్ణాజినం వజ్రప్రాయ
మహాబలం కపివరం – శ్రీ రామ దూతం భజే

Saturday, 5 April 2014

lord hanuman prayers collection


వ్రత ప్రసన్నా! వాయుకుమారా!
వానర వీరా! నమోస్తుతే
ప్రసన్న వదనా! ప్రశాంత వచనా!
ప్రభూత కరుణా! నమోస్తుతే
సుదీర్ఘ వాలా! శుభైక శీలా!
సురేశ పాలా! నమోస్తుతే
కిరీటి రమ్యధ్వజాగ్రవాసీ!
కృపా వికాసీ! నమోస్తుతే
సమృద్ధ తేజో విలాస కందా!
శ్రీ హనుమా! నమోస్తుతే !

Tuesday, 17 December 2013

PANCHAMUKHA HANUMAN - LORD HANUMAN PRAYER IN TELUGU BHAKTHI ARTICLES COLLECTION


 'హనుమద్ర్వతం' ఆచరించటానికి పవిత్రమైన రోజు. 
కేవల స్మరణమాత్రాన బుద్ధి, బలం, ధైర్యం, యశస్సు, వాక్పటిమ ప్రసాదించే ఆంజనేయస్వామిని పూజించడం వల్ల సర్వభయాలు నశిస్తాయని గ్రహ, పిశాచ పీడలు దరి చేరవని, మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదికాలం నుంచి విశ్వాసం. అటువంటి ఆంజనేయమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతం 'హనుమద్ర్వతం'. మార్గశిర మాసంలో శుక్ల పక్ష త్రయోదశినాడు ఈ వ్రతం ఆచరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 
పూజామందిరంలో బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటుచేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, పుష్పాలతో అలంకరించాలి. కలశం ముందర స్వామివారి చిన్న విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకుని కలశంలోనికి స్వామివారిని ఆవాహన చేసుకుని వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరించాలి. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గోధుమతో చేసిన భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించాలి. 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరించాలి. వ్రతకథా శ్రవణం చేయాలి. రాత్రి ఉపవాసం చేయాలి. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకోవాలి. ఏడాది తరువాత కొత్త తోరం ధరించాలి. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కనీసం ఒకసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వ్రతాచారణం వాళ్ళ సమస్యలు, కష్టాలు, తొలగిపోయి, సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని విశ్వాసం.
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమ కష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశించమని ప్రార్ధిస్తాడు. అప్పుడాయన ఈ 'హనుమద్ర్వతాన్ని' ఆచరింపజేసినట్లు పురాణ కథనం. భీముడు, అర్జునుడు కూడా వేరువేరుగా ఈ వ్రతాన్ని ఆచరించి అజేయులయ్యారని చెబుతారు.