Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Coconut Health Tips. Show all posts

Monday, 6 February 2017
Wednesday, 9 November 2016
COCONUT MILK HEALTH AND BEAUTY TIPS
కొబ్బరిపాలు జుట్టుకు మేలు!
జుట్టు ఎండుగడ్డిలా మారడం, చర్మం పొడిబారి పొట్టులా రాలిపోవడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు వేధిస్తున్నాయా? కొబ్బరిపాలు ఇలాంటి సమస్యలన్నింటికీ సరైన పరిస్కారం.
• అసలు ఆ పాలను ఎలా వాడాలంటే..
* కొబ్బరిపాలల్లో తేమనందించే గుణాలు ఎక్కువ. జుట్టు పొడిబారి, దురదగా అనిపిస్తున్నప్పుడు ఆ పాలను తలకు రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. తరవాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చివర్లు చిట్లిన సమస్య అదుపులోకి వస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది. అలాగే కొబ్బరిపాలల్లో ఉండే కొన్ని పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేందుకు తోడ్పడతాయి. అదే సమయంలో పోషణనూ అందిస్తాయి.
* ముఖానికి వేసుకున్న మేకప్‌ని తొలగించాలా! రెండొంతుల ఆలివ్‌నూనెలో ఒక వంతు కొబ్బరిపాలు కలపాలి. అందులో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. మేకప్ పూర్తిగా పోవడమే కాదు, చర్మానికి పోషణ కూడా అందుతుంది. చర్మం మృదువుగానూ ఉంటుంది.
* జిడ్డు చర్మతత్వం ఉన్నవారు, మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారూ కొబ్బరిపాలను క్లెన్సర్‌గా ఉపయోగించొచ్చు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలూ, కొవ్వులూ చర్మ గ్రంథులు పెద్దగా కాకుండా చేసి, మొటిమల సమస్యను అదుపులో ఉంచుతాయి.
* చర్మంపై పేరుకొనే మృతకణాలు తొలగించేందుకూ కొబ్బరిపాలను ఉపయోగించొచ్చు. పావుకప్పు కొబ్బరిపాలల్లో కాసిని ఓట్స్ వేసి పదినిమిషాలయ్యాక ముఖానికి రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు.
* కొబ్బరిపాలల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది. ఇందులోని రాగి ముడతల్ని నివారిస్తుంది. వయసురీత్యా వచ్చే మచ్చల్నీ తగ్గిస్తుంది. ఈ పాలల్లో ఆరేడు బాదం గింజల్ని నానబెట్టి మర్నాడు మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

Thursday, 22 September 2016
Tuesday, 12 July 2016
Thursday, 21 January 2016
Monday, 11 January 2016
HEALTH BENEFITS WITH COCONUT MILK
తల్లిపాల తర్వాత ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన, ఆరోగ్యదాయకమైన పానీయంగా కొబ్బరిపాలు రెండో స్థానంలో నిలిచాయి. అమ్మపాలకున్న విశిష్టగుణం వీటికీ ఉండటంతో కొబ్బరి పాలు ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండుగా మారే అవకాశముందని భావిస్తున్నారు. వీటిని పానీయంగానే కాకుండా వంటకు కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
తాజా అధ్యయనాల ప్రకారం డైరీ పాలలో లాక్టోస్ అనే ఒకరకం చక్కెర పదార్థం ఉంటుంది. దీన్ని జీర్ణం చేసుకోవడం చాలామందికి కష్టం కావచ్చు.కానీ కొబ్బరి పాలలో అయితే ఈ పదార్థం కనిపించడం లేదని నిరూపించబడింది. అమెరికన్ న్యూట్రిషియన్ స్పెషలిస్టు డాక్టర్ జోష్ ఆక్స్ ప్రకారం కొబ్బరి పాలు తల్లి పాల తర్వాత రెండో ఉత్తమమైన పాలుగా నిలుస్తున్నాయి.
శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలలో తల్లిపాలను, అదనపు ఆహార అనుబంధాలను తగినంతగా పొందని పిల్లలకు ఆవుపాలకు బదులుగా కొబ్బరిపాలనే విస్తృతంగా తాపిస్తున్నారని కేరళ లోని కొచ్చిలోని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) ఛైర్మన్ డాక్టర్ టి.కె జోస్ చెప్పారు. బాగా పండిన కొబ్బరి కాయ గుజ్జునుంచి కొబ్బరి పాలను తయారు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో దీన్ని కొబ్బరి పాలు అని పిలుస్తుండగా మరికొన్ని దేశాల్లో దీన్ని కొబ్బరి జ్యూస్ అంటున్నారు. ఈ టెక్నాలజీని తామే కనిపెట్టామని, దీన్ని మార్పిడి చేయడానికి అందుబాటులో ఉంచుతున్నామని జోస్ చెప్పారు.
మూడు నెలల కాలంలో కేరళ రాష్ట్రంలోని కొబ్బరి ఉత్పత్తిదారులు ఈ అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి పోటీ పడతారని జోస్ చెప్పారు. కోకోనట్ జ్యూస్‌లో కొలెస్ట్రాల్ జీరో స్థాయిలో ఉండటమే కాదు.. ఎనర్జీ వాల్యూ కూడా 100 మిల్లీలీటర్లకు 75 క్కాల్‌ల వరకు ఉంటుందని జోస్ తెలిపారు. కొబ్బరి పువ్వునుంచి తీస్తున్న నీరా పానీయం తర్వాత కోకోనట్ పాలు లేదా జ్యూస్ మన రైతులకు భారీ ఆదాయ వనరుగా మారుతున్నాయని ఇది మార్కెట్లోకి వచ్చాక రైతులకు కొబ్బరిపై న్యాయమైన ధర లభిస్తుదని జోస్ పేర్కొన్నారు.

Friday, 29 November 2013
Subscribe to:
Posts (Atom)