Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Legs Care Tips. Show all posts
Showing posts with label Legs Care Tips. Show all posts

Wednesday, 21 December 2016

LEGS PAIN OVERCOME TIPS IN TELUGU


కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

కాళ్ళ నొప్పి
కాళ్ళ నొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా చెప్పవచ్చు. కాలి వేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలో అయిన రావచ్చు. వృద్దాప్యం, అసౌకర్యంగా ఉండే షూ, ఎక్కువ సమయం పాటూ నడవటం లేదా నిలబడటం, మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇక్కడ తెలుపబడింది.
వెనిగర్
బెణుకులు మరియు గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ల వలన కలిగే అసౌకర్యాల నుండి వెనిగర్ ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని, రెండు చెంచాల వెనిగర్ ను అందులో కలపండి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపండి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టండి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు

ఎప్సం సాల్ట్
నయం చేసే గుణాలను కలిగి ఉండే ఎప్సం సాల్ట్ కాళ్ళలో కలిగే నొప్పుల నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది.

లవంగాల నూనె
తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్ లలో కలిగే కాళ్ళ నొప్పులు, గోళ్లలో కలిగే ఇన్ఫెక్షన్ మరియు కాళ్ళలో కలిగే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లావంగాల నూనెను అప్లై చేయటం వలన తక్షణ ఉపశమనం పొందుతారు. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతికి గురవుతాయి. మంచి ఫలితాల కోసం, రోజులో కొన్ని సార్లు లవంగాల నూనెను అప్లై చేయండి.

Wednesday, 14 September 2016

Friday, 17 June 2016

Wednesday, 9 December 2015

WINTER SEASON LEGS CARE TIPS TO WOMEN


పాదాల పగుళ్లకు..!
ఈ కాలంలో పాదాలు పగిలి ఇబ్బందిపెడుతుంటాయి. దీన్ని నివారించడానికి వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని రెండు చెంచాల ఉప్పూ, చెంచా చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్, గులాబీ నీళ్లూ కలపాలి. ఇప్పుడు పాదాలను అందులో పావుగంట ఉంచి.. ప్యుమిస్ రాయితో రుద్దాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
* తేనెలో తేమనందించే, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి పాదాల పగుళ్లను పోగొట్టి మృదువుగా మారుస్తాయి. పావు బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తేనె కలిపి పాదాలను పావుగంట పాటు నానబెట్టాలి. తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడిగితే, పగళ్లు తగ్గుతాయి.
* మూడు చెంచాల బియ్యప్పిండీ, రెండు చెంచాల తేనె, చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాల పాటు పాదాలను ఉంచి ఈ మిశ్రమంతో స్క్రబ్ చేస్తే ఫలితం ఉంటుంది.
* చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించినా ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెని పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కాళ్ల పగుళ్లు మాయమవుతాయి.

Sunday, 18 October 2015

ENLARGED NERVES IN LEGS CREATES FUTURE PROBLEMS - ARTICLE IN TELUGU ON Varicose veins AND ITS SURGERY



Varicose veins are veins that have become enlarged and twisted. The term commonly refers to the veins on the leg, although varicose veinscan occur elsewhere. Veins have pairs of leaflet valves to prevent blood from flowing backwards (retrograde flow or venous reflux).are veins that have become enlarged and twisted. The term commonly refers to the veins on the leg, although varicose veinscan occur elsewhere. Veins have pairs of leaflet valves to prevent blood from flowing backwards (retrograde flow or venous reflux).

Monday, 22 September 2014

HEALTH TIPS AND SOLUTION TO RECOVER FROM HEEL PAIN IN TELUGU


పాదాల నొప్పికి పరిష్కారం 

పాదాల నొప్పి సాదారణంగా హై హీల్స్ ఎక్కువగా వాడడం వల్ల , ఎక్కువ సేపు నడవడం , 

ఎక్కువ సేపు నిల్చొని ఉండడం , న్యూట్రిషన్ లోపం , అధికబరువు , డయాబెటిక్ , వల్ల వస్తుంది.

పరిష్కారం 

1) ఒక గిన్నె లో నీళ్ళు మరిగించండి , దించి దానిలో 3 స్పూన్ల ఎప్సం (epsam సాల్ట్) లవణం లేదా నార్మల్ సాల్ట్ వేయండి.

2) గోరువెచ్చగా అయ్యాక పాదాలను ఆ నీటిలో 10 నిముషాలు ఉంచండి.నొప్పి లాగేస్తుంది.

3) తర్వాత కొబ్బరి నూనెతో రెండు పాదాలను మసాజ్ చేసి , రిలాక్స్ గా ఒక అరగంట ఎక్కడికి కదలకుండా కూర్చోండి.