Search This Blog

Chodavaramnet Followers

Monday 21 November 2016

HAIR CARE INK

బ్యాంకులో డబ్బులు మార్చుకున్న తర్వాత సుబ్బారావు క్యాషియరును అడిగాడు.
"చేతి మీద ఇంకు మరక, నీళ్ళతో కడిగితే పోతుందా?"
"పోదు!"
"షాంపూతో కడిగిన పోదా? "
" పోదు" అన్నాడు క్యాషియర్. 
"ఎన్ని రోజుల వరకు మరక పోకుండా ఉంటుంది? "
క్యాషియర్ చిరాగ్గా "సంవత్సరమైనా పోదయ్యా!"

సుబ్బారావు ఆనందంగా, ఆశగా,
"సారూ,
అయితే, కొంచెం నా జుట్టుక్కూడా పూయండి. ఎంత డై రాసుకున్నా వారం రోజులకే జుట్టు తెల్ల బడుతుంది సారూ!"
క్యాషియర్ కింద పడి కొట్టుకొని స్పృహ తప్పాడు