Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Telugu Ramayana Stories and Articles. Show all posts

Saturday, 1 July 2017
Wednesday, 21 December 2016
SUNDARAKANDA - RAMAYANAM - TELUGU STORY
అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.
ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచమంతా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని వేదము మనకి చెపుతోంది. ఫలానాచోటనే బ్రహ్మము ఉంటాడని పరుగెత్తడం మొట్టమొదటి భక్తి స్థాయి. కాని అలా పరుగెత్తుతుంటే మీకు ఎప్పటికి బ్రహ్మదర్శనం అవుతుంది? నిజంగా బ్రహ్మదర్శనము చెయ్యాలని అనుకున్నవాడు, నీవు నిశ్శబ్దంగా కూర్చుండిపోయి ఏ అరమరిక లేకుండా ఎవరితో సంబంధం పెట్టుకోకుండా భగవత్ ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాలి.
” అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ”
బయట వెతికితే దొరుకుతుందా? ఎవరు లోపలికి వెడుతున్నారో, అందరిలా బయట ప్రపంచముతో తాదాత్మ్యము చెందడంలేదో అటువంటి మహాపురుషుని స్థితిని హనుమ ఈ రోజు పొంది ఉన్నాడు. అటువంటి స్వామి దర్శనము చేసినంత మాత్రంచేత, అటువంటి సాధకుడిగురించిన మాట విన్నంత మాత్రం చేత మన పాపములుకూడా ఎగిరిపోతాయి. అందుకనే ” వ” బీజాక్షరమును అక్కడ ప్రయోగం చేశారు. అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.
ఈ వేళ హనుమ సీతామాత దర్శనం చెయ్యాలి అని సంకల్పించాడు. అందుకని తాను వెడతానన్నాడు. మిగిలినవాళ్ళు అనలేదు. కాబట్టి వాళ్ళు వెనుక ఉండిపోయారు. హనుమ ముందుకు కొనసాగగలిగాడు. తన సంకల్పంవలన ఆయన చరితార్ధుడయ్యాడు.

Monday, 29 February 2016
Thursday, 18 February 2016
Saturday, 9 January 2016
Thursday, 5 February 2015
STORIES FROM SRIMADRAMAYANAM IN TELUGU - MORAL STORIES FROM RAMAYANAM IN TELUGU
శ్రీమద్రామాయణం లోని కథ
వినయం వివేక లక్షణమ్
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.
* ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
* ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
* మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
* శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.
శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.
రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.
శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.
మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
* శ్రీ రాముడు ఎంత బలశాలి ఐననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణమ్.
* మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణమ్. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
* దయాగుణం ఉత్తమగుణమ్. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
* సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

Friday, 5 December 2014
TELUGU RAMAYANA STORY - HANUMAN AT LANKA IN SEARCHING OF SITA MATHA
హనుమంతుడు దూరాన సీతను చూచుట-శ్రీ రామాయణం
హనుమంతు డా చెట్టుమిదే వుండి సీతకోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూశాడు. అదంతా కల్పవృక్షాలతో నిండి వుంది. అక్కడికి కొద్ది దూరాన హనుమంతున కొక చక్కని మేడ కనబడింది. ఆ మేడకి వెయ్యి స్తంభాలున్నాయి. అది కైలాసశిఖరం లాగా తెల్లగా వుంది. అది ఆకాశం అందేటంత యెత్తుగా వుంది. అక్కడ వొక రమణి దీనురాలై కూచుని వుంది. ఎప్పుడు స్నానం యెరగని మనిషిలాగ ఆమె వుంది. ఆమె కట్టుకున్న చీర మాసిపోయి వుంది. అన్నం లేక చిక్కిపోయిన్నీ వుంది, మాటిమాటికీ నిట్టూర్పులు విడుస్తూంది. శుద్ధపాఢ్యమి నాటి చంద్రరేఖ లాగా అసలే దీనంగా వున్న ఆమె చుట్టూ భయం కొలిపే రాక్షస స్త్రీలు కూచుని వున్నారు. ఆమె యెంత మలినంగా వున్నా చాలా అందకత్తెలాగే కనబడుతోంది. ఆమె కళ్ళు నీళ్ళు పెట్టుకొని , ఆమె వాపోతూ ఏదో ధ్యానిస్తూ వుంది. రాక్షసస్త్రీలేగాని బంధువులెవరూ దగ్గిర లేక దీనంగా వుంది. ఆమె జడ నల్ల తాచులా వుంది.
హనుమంతుడు సీతే అనుకున్నాడు. రాక్షసుడెత్తుకుపోతూ వున్న స్త్రీలాగే వుంది ఆమె. అంచేతనే ఆమె సీత అని అతను నిశ్చయించుకున్నాడు. పైగా రాముడు చెప్పిన నగలే ఆమె దేహం మీద వున్నాయి. కొన్ని నగలు లేవు. మూట గట్టి ఋశ్యమూకం మీద పడవేసినవి అవే అయివుంటాయి. ఆ మూట గట్టిన వస్త్రం యెలావుందో ఆమె కట్టుకున్న వస్త్రం ఆ రంగుతోనే - దాని శేషంగానే వుంది. కనుక, "రాముడు - శోకంతో బాధపడుతున్నది యీమెకోసమే" అని నిశ్చయించుకున్నాడు. "రాముడు సర్వలక్షణుడు. ఈమెకూడా అలాగ సర్వలక్షణ సంపన్నురాలే. కనుక, ఈమె రాముని భార్య అయిన సీతే" అని స్థిరపరచుకున్నాడ డతను. " అయ్యో, ఇలాంటి సీతను విడిచి రాముడెలా బతికివుండగలిగాడూ? ఇలా వుండడం సామాన్యులకు శక్యం కాదు" అని అతను రాముణ్ణి మెచ్చుకున్నాడు.
హనుమంతుడు ఆమె సీతే అని నిశ్చయించుకొనుట
హనుమంతు డింతలో సీతను గురించి మళ్ళి దుఃఖించసాగాడు. "అయ్యో! గురువినీతుడైన లక్ష్మణునకు పూజ్యురాలూ, రామునకూ ప్రియురాలూ అయిన సీతకున్నూ దుఃఖం తప్పింది కాదు. కాలగతి యెవరు దాటగలరు? ఈమె రాముని పరాక్రమమూ లక్ష్మణుని పరాక్రమమూ యెరిగి వున్నది కనుకనే వర్షాకాలంలో గంగానది లాగ ఈ సీత క్షిణించకుండా యిలా వుండగలిగింది. కులంలోనూ, వయస్సులోనూ, స్వభావంలోనూ, సదాచారంలోనూ సీతారాములొకరికొకకు తగివున్నారు. విశాలాక్షి అయిన యీ సీతమూలానే వాలి రాముని చేతిలో కూలి పోయాడు. రావణునితో సమానుడైన కబంధుడూ, భీమవిక్రముడైన విరాధుదున్నూ, యీ సీతమూలానే నాశనం అయిపోయారు. వాలి ఆధీనంలో వున్న దుర్లభ వానర రాజ్యలక్ష్మి ఈ సీతమూలానే సుగ్రీవునకు సంక్రమించింది. నేను సముద్రం దాటాను. ఈ లంకలోకి వచ్చాను. ఇదంతా ఈమెమూలానే. ఈమెకోసం రాముడు జగ్గత్తంతా తల్లక్రిందులు చేసెయ్యగలడు. మిథిలాధిపతి జనకమహారాజు కూతురూ పతివ్రతలలో అగ్రేసరురాలూ అయిన యీ సీత భూమిని భేదించుకుని పుట్టుకువచ్చింది. ఎలాంటి యుద్ధాలలోనూ గూడా వెనుకంజ యెరగని దశరథమహారాజుకి ఈమె పెద్ద కోడలు. ధర్మజ్ఞుడూ, కృతజ్ఞుడూ సర్వజ్ఞుడూ అయిన రామున కీమె ప్రియభార్య. ఇలాంటి సీత యిపుడు రాక్షసస్త్రీల స్వాధీనంలో పడిపోయింది.
ఈమె అయొధ్యలో వున్న సకలభోగాలూ విడిచి భర్తతో నిర్జనారణ్యానికి వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తిపడుతూ భర్తకి శుశ్రూష చేసింది. అడవుల్లో కూడా రాజభవనంలో వున్నట్టే యీమె ఆనందంగా సంచరించింది. ఇలాంటి సీత యిప్పుడు రాక్షసాంగనల చేతిలో చిక్కి సకల యాతనలూ అనుభవిస్తుంది. ఈమె కోసం రాముడు తప్పకుండా రావాలి. సీత రాముడు వస్తాడనే నమ్మకంతోనే ప్రాణాలు నిలుపుకొని వుంది. ఈమె రాక్షసాంగలను చూడ్డంలేదు. ఈ పుష్పాలూ, యీ ఫలాలూ కూడా చూడ్డం లేదు. ఇలాంటి సీతను విడిచిన్నీ రాముడు నిశ్చింతగా వున్నాడు. అలాంటి ధైర్యం మరెవడు చూపగలడు? ఈ సీతమ్మను చూస్తుంటే నా గుండెలు కూడా బద్దలయిపోతున్నాయి. అయ్యో! ఈ సీతమ్మ భూదేవికంటే వోర్పు కలది. రామలక్షణుల రక్షణలో సుఖంగా వున్న యీమె యీ క్రూర రాక్షసాంగనల బారి పడిపోయిందిగదా! అనుకుంటూ ఆమె సీతే అనే స్థిరనిశ్చయంతో అతనా చెట్టుమీదే వుండిపోయాడు.
అప్పటికి చంద్రబింబం పడమటికి వాలింది. చంద్రుడు హనుమంతునకు సాయం చేస్తున్నాడన్నట్లు చల్లని కిరణాలతో అతనికి సేదతీర్చాడు. అప్పుడు హనుమంతుడు బాగా మిమర్శించి చూడగా సీత చుట్టూ కూచునివున్న రాక్షసాంగనలు చాలా ఘోరంగా కనబడ్డారు. వారిలో ఒకరికి ఓక్క కన్నే వుంది. ఒకరికి వొక్క చెవే వుంది. ఒకరికి చెవులు శిరస్సంతా కప్పేశాయి. ఒకరికి చెవులే లేవు. కొందరి గోళ్ళు పారల్లా వున్నాయి. కొందరి నాలుకలు కిందికి వేల్లాడుతున్నాయి. వారందరూ రోకల్లూ, శూలాలూ, ముద్గరాలూ మొదలైన ఆయుధాలు పట్టుకొని వున్నారు. వారందరూ మాటిమాటికి మాంసం తింటూ మద్యపానం చేస్తున్నారు. సీత వొక చెట్టు మొదట కూచొగా వారందరూ ఆమె చుట్టూ కూచుని వున్నారు. మూర్తీభవించిన శోకంలా వుండినా, ఆమెని చూసినందుకు హనుమంతుడు చాలా సంతోషించాడు. అతని కళ్ళల్లో ఆనందబాష్పాలు వెల్లివిరిసాయి. వెంటనే రాముణ్ణీ లక్ష్మణుణ్ణి తలచుకొని నమస్కరించి చెట్టుగుబురులో బాగా నక్కి కూచున్నాడు.

Friday, 21 November 2014
RAMAYANA MORAL STORY OF THE KING RAGHU MAHARAJ AND KOWTHSUDU - COLLECTION OF SRIMADRAMAYANA STORIES IN TELUGU
రఘుమహారాజు – కౌత్సుడు
శ్రీమద్రామాయణం లోని కథ
పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.
శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.
గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.
పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.
తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.
ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.
Subscribe to:
Posts (Atom)