ఎర్రటి పెదాల కోసం
పెదాలు పగిలి బాధపెడుతుంటే, నీళ్లలో ముంచిన వేలిని చక్కెరలో అద్ది పెదాలకు రాయండి. తర్వాత లిప్‌బామ్ రాయండి. రాత్రి పడుకునే ముందు లిప్‌బామ్ రాసి రాత్రంతా వదిలేసినా ఫలితం ఉంటుంది. సున్నితంగా ఉండే టూత్‌బ్రష్‌పై కొంచెం పేస్ట్ వేసి, పెదాలపై వలయాకారంగా రాయండి. దీనివల్ల పొడి చర్మం రాలిపోయి పెదాలు మృదువుగా అవుతాయి.
నీళ్లూ, 'సి'విటమిన్ ఎక్కువగా ఉండే పండ్ల రసాలు తీసుకుంటుంటే పెదాలు తడారిపోకుండా ఉంటాయి. తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. టేబుల్ స్పూన్ తేనె, రెండు చెంచాల చక్కెరా, చెంచా ఆలివ్‌నూనె కలిపి పెదాలకు రాసినా ఫలితం ఉంటుంది.