Search This Blog

Chodavaramnet Followers

Monday 2 March 2015

DONT STOP EATING FOOD - LESS EATING FOOD DOES NOT CURE DISEASES



పొట్టను మాడిస్తే జబ్బులెలా తగ్గుతాయి? 

మన శరీరానికి ఏదన్నా సమస్య వచ్చినపుడు తనంతట తానుగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అలవాటు శరీరానికి పుట్టుకతో వచ్చింది. అదే మన అదృష్టం. శరీరం ఈ పని చెయ్యకపోతే మనం ఏనాడో చచ్చిపోయేవాళ్లం. (వాస్తవానికి చచ్చేది మనం కాదు శరీరం). తనకు వచ్చిన ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి, శరీరానికి అదనంగా శక్తి కావలసి వస్తుంది. మన శరీరంలోని శక్తిలో ఎక్కువ భాగం ఆహారాన్ని అరిగించడానికి, శ్రమ చేయడానికి ముఖ్యంగా ఖర్చు అయిపోతుంది. సుమారుగా మనలో ఉన్న శక్తిలో 75 శాతం శక్తిని ఈ రెండు పనులు చెయ్యడానికి శరీరం ప్రతి రోజూ ఖర్చు చేయవలసి ఉంటుంది. శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి తనలో రోజు ఖర్చు అయ్యే ఈ 75 శాతం శక్తిని పొదుపు చేసుకొని, రక్షణ కార్యక్రమానికి ఉపయోగించే పన్నాగం పన్నుతుంది. రోజంతా మనిషి అలవాటుగా తింటూ ఉంటే, అలాగే తిరుగుతూ ఉంటే మనలో శక్తి పొదుపు కాదు కాబట్టి, తినకుండా తిరగకుండా చేయడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేస్తుంది. నోరు తియ్యగా లాలాజలం ఊరుతూ ఉంటే తినాలని ఉంటుంది. కాబట్టి నాలుకను పాచితో నింపి, దాన్ని చేదుగా చేసి, లాలాజలం ఊరకుండా చేసి మనకు ఆహారం మీద వాంఛ లేకుండా చేసి, పొట్టలో ఆహారం పడకుండా మొదటి జాగ్రత్త చర్య తీసుకుంటుంది. మనం హుషారుగా ఉంటే అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తాం కాబట్టి, తిరగకుండా ఉంచడం కోసం ఒళ్లు నొప్పులుగా, పులపరంగా, నీరసంగా చేసి పడుకుంటే బాగుంటుందని మన కనిపించేట్లుగా చేసి రెండవ జాగ్రత్త చర్య తీసుకుంటుంది. ఇలా రెండు రకాలుగా శరీరం శక్తిని పొదుపు చేసే ప్రయత్నం చేసి, రక్షణ కార్యాన్ని నిర్వహించడానికి ఆ శక్తి వినియోగిస్తూ ఉంటుంది. ఆ రక్షణ పని పూర్తి అయ్యే వరకూ మనకు తినాలని ఉండదు, తిరగాలని ఉండదు. ఇది శరీర ధర్మం. మీకు పుట్టాక ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా వచ్చాయా? రాలేదని ఎవరూ అబద్ధం చెప్పలేరు. మనం తింటే తినవచ్చు. తిరిగితే తిరగవచ్చు. ఒకసారి ఆలోచించండి. శరీరం ఎవరినీ బాగు చేయడానికి ఈ కష్టమంతా పడుతోంది. మన సుఖం గురించే కదా దాని తాపత్రయమంతా. మనల్ని నూతుల్లో, గోతుల్లో దూకమనడం లేదే! రక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసిన శక్తి అంతా నాలో ఉన్నది నాకు సరిపోతుంది, నీవు ఆ శక్తిని వృథా చేయకుండా ఉంటే అదే నా అదృష్టంగా భావిస్తానంటుంది. అది అడిగింది ఒక చిన్న కోరికే కదా. ఇన్నాళ్లూ నీవు శుభ్రంగా తినేటట్టు, తిరిగేటట్లు చేశాను. అయినా ఏనాడూ ఒకసారి కూడా థ్యాంక్స్‌ చెప్పిన పాపాన పోలేదు. అయినా పట్టించుకోకుండా నా డ్యూటీని నేను చేసుకుంటూ పోతున్నాను. కానీ, ఈ రోజు నాకు బాగోలేదు కాస్త రెస్టు ఇవ్వమని అడిగినా నా మాట వినవా? అని శరీరం సందర్భమొచ్చినపుడు ప్రాధేయపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ పట్టించుకోక పోయినా కనీసం ఆపద వచ్చినప్పుడైనా ఆదుకుంటే మన జీవనయానం, సుఖంగా సాగేటట్లు చేస్తుంది కదా! శరీరం గోడు వినిపించుకోవడానికి చదువు సంధ్యలు, తెలివి తేటలు, వైద్య శాసా్త్రలు అవసరం లేదు. అసలు మనకు ఆ గోడు వినిపించకపోవడానికి ఇవే అడ్డుగోడలు. పొట్టను మాడిస్తే జబ్బులెలా తగ్గుతాయి? అవన్నీ మూఢ నమ్మకాలు, అన్‌ సైంటిఫిక్‌ విషయాలని కొందరు వైద్యులు తిడుతూ ఉంటారు.

పొలాన్ని దున్ని ఎండగట్టినప్పుడే తెగుళ్లు తగ్గుతాయి. వైద్యశాసా్త్రలు, సైన్స్‌ అనే మాట పుట్టకముందే... అసలు మనిషి పుట్టకముందే పొట్టను మాడ్చితే జబ్బులు తగ్గుతాయనే సైన్స్‌ పుట్టింది. అదే ప్రకృతి సైన్స్‌. ఈ సైన్సును ఎవరూ మార్చడానికి వీల్లేదు. జీవులున్నంత వరకూ ఈ సైన్సే వాటిని రక్షించేది కూడా. చివరకు మనకు కూడా అదే గతి. నమ్మినవాడు ఆ జంతువుల్లాగా బాగుపడతాడు. నమ్మని వాడు మనిషి లా బాధపడతాడు.

- ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజు
ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకూ 0863 - 2333388కు కాల్‌ చేయవచ్చు.