Search This Blog

Chodavaramnet Followers

Thursday 26 February 2015

TOP FIVE SKIN CARE TIPS IN TELUGU - SKIN CARE WITH CLEANING - WATER - FATTY ACIDS - SUN PROTECTION AND ANTI OXIDENTS


చర్మానికి పంచ సూత్రాలు 

ఇంట్లో ఖరీదైన చర్మ సౌందర్య సాధనాలు, బ్యూటీ పార్లర్‌లో విలాసవంతమైన సౌందర్య చికిత్సలు ఎన్ని ఉపయోగించినా చర్మానికి అత్యవసరమైనవి అందిస్తేనే ఆరోగ్యవంతంగా కాంతులీనుతుంది. మృదుమైన చర్మం కోసం ఈ ఐదు సూత్రాలు పాటించి చూడండి.

• క్లీన్సింగ్‌

చర్మ పై పొరల్లో పేరుకుపోయిన వ్యర్థాల్ని, నూనెల్ని, కాలుష్య ప్రభావాన్ని తొలగించి మచ్చలు ఏర్పడకుండా చేయడంలో దీన్ని మించిన చికిత్స లేదు. క్లీన్సర్‌ ఉపయోగించాక ముఖ చర్మంపై ఉపయోగించే సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజర్లు కూడా చర్మం లోపలికి తేలికగా పీల్చుకోబడతాయి. కాబట్టి సోప్‌ ఫ్రీ ఫేషియల్‌ క్లీన్సర్లనే వాడండి.

• నీళ్లు

హైడ్రేషన్‌ విషయంలో మిగతా శరీరానికి చర్మానికి తేడా లేదు. నీళ్లు తాగటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. నీరు చర్మంలోని ఇంప్యూరిటీ్‌సని తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది. రోజుకి రెండు లీటర్ల నీరు తాగితే చర్మం బిగుతుగా, మృదువుగా, నునుపుగా తయారవుతుంది.

• ఫ్యాటీ యాసిడ్లు

ఒమేగా3, ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్‌ కోడి మాంసం, గుడ్లు, గింజలు, వంట నూనెల్లో ఉంటుంది. ఒమేగా3 సాల్మనెల్లా, సార్డీన్‌ చేపలు, ఫ్లాక్స్‌ విత్తనాలు, కిడ్నీ బీన్స్‌, వాల్‌నట్స్‌, బచ్చలి కూరల్లో ఉంటాయి.

• సన్‌ ప్రొటెక్షన్‌

సన్‌స్ర్కీన్‌ లోషన్ల వల్ల సూర్యరశ్మి ప్రభావం నుంచి, స్కిన్‌ క్యాన్సర ్లనుంచే కాకుండా చర్మాన్ని వృద్ధాప్య లక్షణాల నుంచి కూడా తప్పించవచ్చు. ఎటువంటి రక్షణా లేకుండా చర్మాన్ని వదిలేస్తే చర్మం రంగు మారడంతోపాటు ముడతలు ఏర్పడటం, పటుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రమాదమైన అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించాలంటే 15 కంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్ర్కీన్‌ లోషన్‌నే వాడాలి.

• యాంటీ ఆక్సిడెంట్స్‌

చర్మానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఎన్నున్నా వీటిలో రెండు మాత్రం చర్మానికి ఎక్కువ మేలు చేస్తాయి.
విటమిన్‌ సి - చర్మానికి పటుత్వాన్నిచ్చే కొల్లాజెన్‌ను వృద్ధి చేస్తుంది. ఈ విటమిన్‌ పొట్టు తీయని ధాన్యాలు, యాపిల్స్‌, నిమ్మ జాతి పండ్లలో ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్‌ ఆహారంలో రోజూ75 మి.గ్రాలు ఉండేలా చూసుకోవాలి.
విటమిన్‌ ఇ - కణ పొరలకు రక్షణ కల్పించటంతోపాటు అలా్ట్రవయొలెట్‌ నష్టాన్ని తగ్గిస్తుంది. వీట్‌ జెర్మ్‌ ఆయిల్‌, బాదం, పీనట్‌ బటర్‌లలో ఇ-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. రోజుకి 15 మి.గ్రాముల ఇ- విటమిన్‌ తీసుకోవాలి.