Search This Blog

Chodavaramnet Followers

Thursday 26 February 2015

SUMMER HEALTH TIPS WITH KARBUJA FRUIT - LOST OF VITAMINS IN KARBUJA FRUIT - KARBUJA FRUIT HEALTH TIPS IN TELUGU


తరగని అందం, ఆరోగ్యం తర్బూజాతో సొంతం..!

తర్బూజా.. వేసవిలో దొరికే పండ్లలో ఒకటి. ఇది దోసకాయ కుటుంబానికి చెందింది.. బయటి భాగం లేత పసుపుపచ్చ రంగులో లోపలి భాగం నారింజ రంగులో ఉంటుంది. ఈ పండులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే శరీరం, చర్మం.. రెండూ ఆరోగ్యంగా తయారవుతాయి. దీనిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. 

ఇవే కాదు.. తర్బూజా వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి..

• విటమిన్ సి ఎక్కువగా..

తర్బూజాలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో కణవ్యవస్థని దెబ్బతీసి.. వివిధ రకాల వ్యాధులు, వయసు పైబడే కొద్దీ వచ్చే ముడతలకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ని ఎదుర్కోవడంలో ఇది తోడ్పడుతుంది. విటమిన్ సి తెల్లరక్తకణాల పనితీరును మెరుగుపరిచి, వ్యాధినిరోధక శక్తిని పటిష్ట పరుస్తుంది. శరీరంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్.. లాంటి వాటిని నాశనం చేయడానికి తెల్లరక్తకణాలు ఉపయోగపడతాయి.

• కంటి ఆరోగ్యానికి..

మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ ఎ తక్కువగా ఉన్నట్త్లెతే తర్బూజాను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో అధిక మొత్తంలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ రెండూ కంటి ఆరోగ్యానికి అత్యవసరం. ఎవరైతే ఉప్పు, వెన్న, అనవసరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారో వారికి క్యాటరాక్ట్ సర్జరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

• ఒత్తిడిని తగ్గిస్తుంది..

ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు తర్బూజా తినడం మంచిది. ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని అదుపులో ఉంచి.. మెదడుకు ఆక్సిజన్ పంపుతుంది. దీంతో ఒత్తిడి తగ్గి చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.
గుండె సంబంధిత సమస్యల నుంచి..

తర్బూజాలో అడినోసిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను అరికట్టడంలో తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ గుండెపోటు నుంచి విముక్తి కలిగిస్తుంది.

• నెలసరి సమస్యల్ని తగ్గిస్తుంది..

కొంతమంది మహిళల్లో నెలసరి అసలు సమయం కంటే ముందు రావడం.. ఆలస్యంగా రావడం.. ఇలా ఓ కచ్చితమైన సమయమంటూ లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వస్తుంటుంది. ఈ పండుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నెలసరి సమస్యను అదుపులో ఉంచొచ్చు. అలాగే మరికొంతమంది మహిళల్లో ఇతరత్రా రుతు సంబంధ సమస్యలు ఏవైనా ఉన్నా.. వీటన్నింటినీ తగ్గించి ఉపశమనం కలగజేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నెలసరి రావడానికి కూడా ప్రేరేపిస్తుంది.

• బరువు తగ్గించుకోవడానికి..

మీరు ఎక్కువ బరువుతో బాధపడుతున్నారా? అయితే తర్బూజా పండును బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలుంటాయి. కాబట్టి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

• ప్రెగ్నెన్సీ సమయంలో..

తర్బూజాలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫోలేట్.. శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది గర్భం దాల్చిన మహిళలకు చాలా అవసరం కూడా.. ఇంకా భ్రూణంలో ఏమైనా న్యూట్రల్ ట్యూబ్ డిజార్డర్స్ లాంటివి ఉంటే వాటిని తొలగిస్తుంది.
తరగని అందానికి..

* తర్బూజాలో ఉండే కె, ఇ విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

* తర్బూజాలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోకి నీరు ఎక్కువ మొత్తంలో చేరి శరీరం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

* తర్బూజాలో ఉండే ఎ విటమిన్ వల్ల చర్మం పునరుత్తేజితమవుతుంది. అలాగే విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఏర్పడుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

* తర్బూజా ముక్కలకు ఓట్‌మీల్ పౌడర్, పెరుగు కలిపి మెత్తగా చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ముఖానికి ఇంకా మంచి గ్లో రావాలంటే ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేసుకోవాలి.

* తర్బూజా రసాన్ని ముఖానికి అప్త్లె చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మం మృదువుగా తయారవడంతోపాటు హైడ్రేట్ అవుతుంది.

* తర్బూజాలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫోలికామ్లం వల్ల శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తవుతాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

* చర్మం ఎలాస్టిసిటీ, వయసు పైబడుతున్న కొద్దీ ఏర్పడే ముడతల్ని తగ్గిస్తుంది.

* ఈ పండులో ఉండే పోషకాలు, మినరల్స్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకు కావలసిన ఇన్సోనిటాల్ తర్బూజాలో ఉంటుంది.

* ఎండాకాలంలో జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. షాంపూ చేసుకున్న తర్వాత ఒక కప్పు తర్బూజా ముక్కల్ని గుజ్జులా చేసి జుట్టుకు మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చూశారుగా.. తర్బూజా తినడం వల్ల అందం, ఆరోగ్యం ఎలా సొంతం చేసుకోవచ్చో. మరి వేసవిలో దొరికే తర్బూజాతో తరగని ఆరోగ్యం, అందం సొంతం చేసుకోండి.