హెల్దీ ఫుడ్‌తో ఆరోగ్యంగా...!
టీనేజీ గర్ల్స్ అంటేనే యంగ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించాలి. చలాకీ, ఉత్సాహానికి తామే చిరునామా అనిపించేలా మెదలాలి. అదే కొంత వయసు పెరిగితే 20 నుంచి 30 ఏళ్ల లోపు అమ్మాయిలు చదువు, ఉద్యోగం, పెళ్లి.. అన్నీ ఈ వయసులోనే జరిగిపోతాయి. మరి ఈ బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వహించగలగాలి. ఇక ఆ తర్వాతంటారా? ప్రతిరోజూ మల్టీటాస్కింగే.. ఈ తరం మహిళలు ఇన్ని బాధ్యతలను తీసుకున్నారు సరే.. వీటిని సమర్థంగా నిర్వహించడానికి పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. కానీ పాతికేళ్లలోపున్న చాలామంది మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అన్ని పనులూ చేసుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసు వాళ్లు ఎలాంటి ఆహార నియమాలను పాటించాలో చూద్దామా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్లిమ్‌గా ఉండాలి. జీరోసైజ్ బాడీ ఉండాలి అంటూ తిండి మానేసి మరీ కష్టపడిపోతున్నారు. కానీ ఆరోగ్యంగా ఉండటం అంటే మరీ లావుగా కాకుండా, మరీ బక్కపల్చగా కాకుండా ఉండాలి. వయసుకు, ఎత్తుకు తగిన బరువుండాలి. శరీరాకృతీ ఉండాలి. అప్పుడే అందంగా ఉంటారు. కానీ మనదేశంలో అమ్మాయిలు ఇలా అస్సలు ఉండటం లేదు. అయితే లావయిపోతున్నారు. లేకపోతే మరీ పీలగా తయారవుతున్నారు. మధ్యస్థంగా ఉండే అమ్మాయిల సంఖ్య గత రెండేళ్లలో బాగా తగ్గిందని హార్వర్డ్, టొరంటో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన సర్వే వెల్లడించింది.
'డైటింగ్ చేస్తూ తగిన పోషకాహారం తీసుకోకుండా ఉండటం వల్లే అమ్మాయిలు ఇలా తక్కువ బరువుంటున్నారని, 25 సంవత్సరాల లోపు వాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని ఈ అధ్యయనాలు నిరూపించాయి.
• పోషకాహారం తప్పనిసరి..
అమ్మాయిల్లో పన్నెండు సంవత్సరాల నుంచి మొదలుకొని పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి శారీరకంగా జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోతాయి. హార్మోన్ల పనితీరు చురుగ్గా తయారవుతుంది. క్రమం తప్పకుండా పిరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇంటిపనులు, చదువులు, ఉద్యోగాలు, సినిమాలు, స్నేహాలకు సమయం కేటాయించాల్సి రావచ్చు. ఇలా కేటాయించడం వల్ల క్షణం తీరిక కూడా ఉండదు. ఇవే కాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్, స్నేహితులతో తమను తాము పోల్చుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఇలాంటి వాటితో ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. అందుకే ఈ వయసు వాళ్లకు శరీరానికి తగినన్ని పోషకాలు అందడం తప్పనిసరి. దీనికోసం కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు కలగలిపి ఉండే డైట్‌ని తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోకూడదు. హోల్‌వీట్, ఓట్స్‌తో చేసిన పదార్థాలు, చిక్కుడు జాతి గింజలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. పండ్లు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజూ తినే ఆహారంలో పప్పు దినుసులు తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు కదలకుండా కూర్చోకూడదు. టీవీలు, కంప్యూటర్ గేమ్స్, ఆన్‌లైన్ ఛాటింగ్‌లు ఎక్కువసేపు కదలనీయకుండా చేస్తాయి. కానీ మధ్యమధ్యలో కనీసం ఐదు నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి.
• నిర్లక్ష్యంతో సమస్యలే..
పెళ్లి చేసుకొని మరిన్ని బాధ్యతలు చేపట్టే వయసులో ఆహార నియమాలను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం భవిష్యత్తుపై పడుతుంది. తర్వాత ఎదురయ్యే చాలా ఆనారోగ్యాలకు ఇది కారణంగా మారొచ్చు. పోషకాహార లోపంతో ప్రధానంగా ఎదురయ్యే సమస్య రక్తహీనత.
• మరో సమస్య పీసీఓడీ..
పాతికేళ్లలోపే పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడటానికి అవకాశాలు ఎక్కువవుతాయి. పీసీఓడీ వల్ల ఇర్రెగ్యులర్ పిరియడ్స్, అవాంఛిత రోమాలు, శరీరాకృతి అసహజంగా మారిపోవడం, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోవడం, మొటిమల సమస్య లాంటివి చుట్టుముడతాయి.
ఇలాంటి వ్యాధులను నియంత్రించడానికి చాలామంది చేసే పని కొంత కాలం పాటు మాత్రలు వాడటం.. వీటిని కొద్ది రోజులు మాత్రమే ఉపయోగించి తర్వాత అదే తగ్గుతుందిలే అని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఈ వ్యాధులు అంత త్వరగా పోయేవి కావు.. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకుంటూ ఉండాల్సిందే.. లేకపోతే గర్భం ధరించడంలో ఇబ్బందులు, గర్భం ధరించిన తర్వాత హైబీపీ, జస్టేషనల్ డయాబెటిస్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు ఆగిపోతాయనుకోవడానికి లేదు.. ఆ తర్వాత కూడా ఒంట్లో కొవ్వు పేరుకుపోయి, ఎముకలు గుల్లబారిపోయి, కండరాలు శక్తి కోల్పోయి అనేక అనారోగ్యాలు బాధపెడతాయి. వీటిన్నింటినీ ఎదుర్కోవాలంటే ముందు నుంచే చక్కని పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండటమే మార్గం.
• చక్కెర, కొవ్వు తక్కువగా..
కాలేజీకి వెళ్తూ ఉత్సాహంతో ఉరకలెత్తే అమ్మాయిలకు ప్రధానంగా అందాల్సిన పోషకాలు ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు. 18 సంవత్సరాల వయసున్న అమ్మాయి రోజూ తినే ఆహారంలో 270 గ్రాముల గింజధాన్యాలు లేదా తృణధాన్యాలు; 250 గ్రాముల కూరగాయలు; 100 గ్రాముల పండ్లు; పాలు, పెరుగు, పనీర్ లాంటి పాల ఉత్పత్తులన్నీ కలిపి 300 గ్రాములు; ప్రొటీన్లు 60 గ్రాములు ఉండాలి. కొవ్వు, చక్కెర కలిపి 20 గ్రాములు ఉంటే సరిపోతుంది.
• బరువును బట్టి..
పెళ్త్లె ఇంటి బాధ్యతల్లో తలమునకలుగా ఉండే ఆడవాళ్లకు సాధారణంగా వచ్చే డౌట్ తామెన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలి? అని. ఇది వాళ్ల లైఫ్‌స్త్టెల్, బరువును బట్టి నిర్ణయించుకోవాలి.
ఉదాహరణ 40 కిలోల బరువుంటే మహిళకు 1500 క్యాలరీలు సరిపోతాయి. ఇక చురుగ్గా పనిచేసేవాళ్లు, గర్భిణులు 2300 క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పుడు కొన్ని అదనపు క్యాలరీలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని సరైన పోషకాల నుంచి తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే చిలగడదుంప, క్యాబేజీ, పాలకూర, బంగాళాదుంపలు, బాదం, సోయా, గుడ్లు, పాల నుంచి తీసుకోవాలి. ఇక సాధారణంగా 60 కిలోల బరువుండి తక్కువగా పనిచేసే వాళ్లు 2000 క్యాలరీలు, మరీ చురుగ్గా పనిచేసేవాళ్లు 3000 క్యాలరీలు తీసుకుంటే మంచిది. 70 కేజీల బరువుండి ఏమాత్రం పనిచేయని వాళ్లకు 2200 క్యాలరీలు సరిపోతాయి. బరువు తగ్గాలనుకుంటే శరీరాకృతి, బీఎంఐని దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం మాత్రం మంచిది కాదు.
సమస్యలు దరిచేరకుండా..
వ్యాధులను దూరంగా ఉంచుకోవడానికి వాటికి సంబంధించిన పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
• ఎముక పుష్టి కోసం:
కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, రాగులు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
• రక్తహీనత రాకుండా:
ఆకుకూరలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మన శరీరానికి అందాలంటే సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ జాతి పండ్లు, టొమాటో, కీరదోస వంటి వాటిల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
• కొవ్వు పెరగకుండా:
ప్రాసెస్ చేయని ఆహారపదార్థాలు, పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటివల్ల శరీరానికి పీచుతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా అందుతాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ని ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
• వ్యాయామం తప్పనిసరి:
కొందరు ముందునుంచీ అతిగా వ్యాయామం చేస్తే.. మరికొందరు నలభై దాటాక చేస్తే సరిపోతుందిలే అంటూ నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఎవరి వయసుకు తగ్గట్టుగా వాళ్లు వ్యాయామం చేయాలి. ఇంటిపని, అరగంట పాటు నడక, పరుగు ఇలా ఏదో ఒకటి చేయాలి. వాకింగ్ చేసే వాళ్లకైతే కనీసం పదివేల అడుగులు వేయడం చాలా అవసరం. ఎక్సర్‌సైజ్ వల్ల కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.