Search This Blog

Chodavaramnet Followers

Saturday 21 February 2015

CHOCLATES - WHEAT PRODUCTS - GRAPES - EGG ETC FOOD ARE NOT GOOD FOR BABIES AGED 3 TO 12 MONTHS - HEALTH TIPS TO 3 TO 12 MONTHS BABIES IN TELUGU


3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ వయస్సు పిల్లలు రోజంతా నిద్రకు పరిమితం కావడంతో పాటు అజీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సరిగా జీర్ణం అవ్వకపోవడంతో పిల్లలు వాంతులు చేసుకోవడం మరియు ఊపిరిడకపోకుండా కూడా చేస్తాయి.

అందువల్లే ఎగ్ వైట్, చాక్లెట్, గోధుమలతో చేసిన వంటకాలు 3-12 నెలల మధ్య గల పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది. ఎగ్ వైట్ చిన్నపిల్లలకు(ఒక సంవత్సరంలోపు పిల్లలకు) అంత మంచి ఎంపిక కాదు. ఎగ్ వైట్ చిన్న పిల్లల్లో పొట్ట సమస్యలను లేదా ఎగ్జిమాకు గురిచేస్తుంది. పసిపిల్లలు నివారించాల్సిన ఆహారాల్లో ద్రాక్ష కూడా ఒకటి. ఇవి పిల్లలకు పుల్లగా ఉండటం మాత్రమే కాదు, గొంతు సమస్యలకు గురిచేస్తుంది. అంతే కాదు, డయోరియాకు గురిచేస్తుంది. అన్ పాచ్యురైజ్డ్ చీజ్ చిన్న పిల్లలకు ఫుడ్ పాయిజ్ లక్షణంగా మారుతుంది. ఈ ప్రమాదం నుండి రక్షించాలంటే, పసిపిల్లలకు చీజ్‌ను పెట్టకూడదు.

ఇక గోధుమలతో తయారుచేసిన ఏ ఆహారాన్నైనా పిల్లలకు పెట్టకూడదు. గోధుల్లో గులిటిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లల్లో ఇది జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. ఇంకా పసిపిల్లలకు స్ట్రాబెర్రీలు పెట్టకపోవడం మంచిది. వీటిలో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది పసిపిల్లలకు చాలా ప్రమాదకరమైనవి. ఇది పిల్లలకు ఒక అసిడిక్ ఫుడ్ కాబట్టి ఎట్టిపరిస్థిల్లో పసిపిల్లలకు వీటిని అందివ్వకండి. చాక్లెట్‌లో ఎక్కువ కెఫిన్ ఉండటం వల్ల ఇది పసిపిల్లలకు అంత మంచిది కాదు.