యువతులకి గోళ్ళు అందంగా పెంచుకోవడం అనేది ఒక సరదా. అందుకోసం అడపాదడ పనైల్ కట్టర్‌తో షేప్ చేసుకుంటూవుంటారు. మెరిసి పోయే విధంగా గోళ్ళు ఉండాలనుకుంటున్నారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే అవి ఎంతో అందంగా కనిపింస్తాయి. గోళ్లను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరు చుకోండి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి 3, 4 నిమిషాల వరకు అందులో ఉంచండి. గోళ్ల దగ్గర కొద్దిగా మసాజ్ చేయడం అవసరం. దీంతో అక్కడ రక్త ప్రసారం బాగా జరుగుతుంది. గోళ్ళకు మంచి ఆకారాన్ని ఇవ్వటానికి ఫైలర్‌ను వాడండి. నెయిల్ పాలిష్‌ని రెండువైపులా రూట్స్‌ని కొద్ది వదిలి వేయాలి.ఎప్పుడూ నెయిల్‌పాలిష్‌నే వాడకండి. తరచుగా నెయిల్ పాలిష్, రిమూవర్ ఉపయోగిస్తూ ఉంటే గోళ్ళ రంగు మారి పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కఠినంగా కూడా తయారవుతాయి. కాబట్టి గోళ్ళకు పాలిష్ నుంచి కొంతకాలం వరకు విశ్రాంతి నివ్వండి.
నెయిల్‌పాలిష్‌ను తీసివేయటానికి ఎసిటోన్ ద్రావకాన్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది. ఎసిటోన్ వాడకుండా ఒక మంచి కంపెనీ నెయిల్ పెయింట్ రిమూవర్‌ను వాడండి. గోళ్ళు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు కాల్షియం మాత్రలు వాడండి. సాధ్యమై నంతవరకు గోళ్ళను ఎక్కువ పొడ్డుగా పెంచకూడదు. చిన్న సైజులో అందంగా మెయింటైన్ చేయండి. చిన్నవి బలంగా ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి మేని క్యూర్, పెడిక్యూర్ చేయించండి. దీంతో కాళ్ళు, చేతులు చర్మం మెరిసిపోతుంది. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పాత్ర లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, హార్డ్ కెమికల్స్ ఉన్న సబ్బునుగానీ, డిటర్జెంట్‌గానీ వాడకం డి. ఇలా చేస్తే గోళ్ళు అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటాయి.