Search This Blog

Chodavaramnet Followers

Thursday, 18 April 2013

LOVE ARTICLE ON LOVELY VALENTINES DAY - A BRIEF HISTORY AND FACTS OF LOVERS DAY CELEBRATED ALL OVER THE WORLD


ప్రేమ... మాటల్లో చెప్పలేని తీయని అనుభవం. ప్రేమిస్తే గాని తెలియదు దాని గొప్పతనం. రెండు మనసులు పెనవేసుకునే అనుబంధం. భారత దేశంలో ప్రేమ కథలకు కొదవ లేదు. పురాణ పురుషుల నుంచే ప్రేమ ఉంది. అయితే అప్పటి ప్రేమకు ఇప్పటి ప్రేమకు తేడాలు చాలానే ఉన్నాయి. చాలామంది యువత ప్రేమ పెళ్లి పీటల వరకు నిలువడం లేదు. కేవలం జీవితంలో అదో తంతు అన్న విధంగా గడిపేస్తున్నారు. ఇరవయ్యేళ్లుగా మన దేశంలో ప్రేమికులు రోజు జరుపుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుండడం గమనార్హం. అయితే ఈ వేడుకలపై హిందుత్వ సంస్థలు గుర్రగా ఉన్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వేడుకలు విరుద్ధమని పేర్కొంటున్నాయి. బహిరంగంగా కనిపించిన ప్రేమికులకు వివాహాలు చేసేందుకు వెనుకాడడంలేదు. ఈ నేపథ్యంలో యువత రేపు ప్రపంచ ప్రేమికులు దినోత్సవం జరుపుకోబోతున్నారు. 

loveeప్రేమికుల రోజు లేదా సెయింట్‌ వాలెంటైన్స్‌ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవు దినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్‌ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం, మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికి ఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అసంఖ్యాక క్రైస్తవ మృతవీరుల్లో (మతం కోసం బలి ఇవ్వబడిన వ్యక్తులు) ఇద్దరికి వాలెంటైన్‌ అనే పేరు ఉండటంతో ఈ సెలవు దినానికి కూడా ఇదే పేరు పెట్టారు. మధ్యయుగ కాలానికి చెందిన జెఫ్రే చౌసెర్‌ రచనల కారణంగా శృంగార ప్రేమతో ఈ రోజుకు అనుబంధం ఏర్పడింది. ఈ కాలంలోనే నాగరిక ప్రేమ సంప్రదాయం కూడా వృద్ధి చెందింది.
మన దేశంలో...
love
  • ఇండియాలోనూ ఇరవయ్యేళ్లుగా ప్రేమికుల రోజును జరుపుకునేవారి సంఖ్య పెరిగింది.
  • ఎక్కువగా పెళ్లికాని యువత ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
  • ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రమే ఎక్కువగా ఈ రోజును జరుపుకుంటున్నారు.
  • ఆర్షించేందకు హోటళ్లలో, రెస్టారెంట్లలో ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేక 
    ఏర్పాటు చేస్తున్నారు.
  • వారం ముందు నుంచే బహుమతుల దుకాణాలు, బట్టల దుకాణాల్లో సందడి ఉంటుంది.
  • ప్రేమ సందేశాలు, ఫ్లవర్‌ బొకేలతో పోస్టాఫీస్‌లు, కొరియర్‌ సెంటర్లు నిండిపోతాయి.
  • రిసార్ట్‌లు ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేపట్టాయి.
  • మన దేశంలో ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించలేదు.
  • ఈ ఒక్క రోజే కేవలం పువ్వుల కొనుగోళ్లే కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుందని అంచనా.
  • ప్రేమికుల రోజును జరుపుకోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని.. అది పాశ్చాత్య పోకడలకు నిదర్శమని భారతీయ జనతా పార్టీ సహా కొన్ని హిందుత్వ సంస్థలు నిషేధించాయి. ఈ రోజున సదరు కార్యకర్తలు బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు కనిపిస్తే వివాహం కూడా చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి చర్యలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.


  • 1980 తరువాత...
    doves-in-love20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాల కానుకలు అందజేయడానికి, సాధారణంగా పురుషుల నుంచి మహిళలకు, కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయమైంది. ఇటువంటి కానుకలను గులాబీలు, చాక్లెట్‌లతో కలిపి ఎరుపు వస్త్రంతో తయారు చేసిన హృదయాకారపు పెట్టలో ఉంచి ఇచ్చేవారు. 1980వ దశకంలో, వజ్రాల పరిశ్రమ కానుకలుగా ఆభరణాలను ఇచ్చే సందర్భంగా కూడా ప్రేమికుల రోజును ప్రోత్సహించడం ప్రారంభించింది. ఈ రోజున హ్యాపీ వాలెంటైన్స్‌ డే అనే సాధారణ అలైంగిక అభినందన తెలియజేయడం కూడా సంప్రదాయంగా మారింది. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, పిల్లలు ఈ రోజున తరగతి గదులను అలంకరించడం, కార్డులు పంచుకొని మిఠాయిలు తినే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. ఈ గ్రీటింగ్‌ కార్డుల్లో విద్యార్థులు ఒకరిలోఒకరికి నచ్చే అంశాలను ప్రస్తావిస్తుంటారు.

    ప్రచారంలో ఓ కథ...
    BigPinkHeartఆ రోజుల్లో రోమ్‌ చక్రవర్తి క్లాడియస్‌-2 యువకులను వివాహితులు కాకుండా అడ్డుకునే ఉద్దేశంతో జారీ చేసిన అంగీకారయోగ్యం కాని చట్టాన్ని వాలెంటైన్‌ వ్యతిరేకించాడు. వివాహితులు మంచి సైనికులు కాలేరని భావించిన చక్రవర్తి తన సైన్యాన్ని పెంచుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే వాలెంటైన్‌ యువకులకు రహస్యంగా వివాహాలు జరిపించేవాడు. ఇది క్లాడియస్‌కు తెలిసిపోవడంతో వాలెంటైన్‌ను చెరసాల్లో వేశాడు. తనను ఉరి తీసే ముందు రోజు సాయంత్రం వాలెంటైన్‌ తాను ప్రేమించిన చెరసాలాధికారి కుమార్తె చిరునామాకు తొలిసారి ప్రేమ సందేశం పంపాడు. కారాగారంలో ఉన్న సమయంలో వాలెంటైన్‌ చెరసాలాధికారి కుమార్తెతో స్నేహం చేయడమేగాక ఆమె అంధత్వాన్ని పోగొట్టాడు. 

    మీకు తెలుసా...
    వాలెంటైన్స్‌ డే సందర్భంగా దాదాపు 141 మిలియన్ల కార్డులు పంపిణీ అవుతాయి.
    397 మిలియన్‌ డాలర్ల విలువజేసే పూలు అమ్ముడవుతాయి.
    అమెరికాతో పాటు కెనడా, మెక్సికో, యునెటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, అస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్‌, జపాన్‌లలో డేను బాగా జరుపుకుంటారు. మిగతా దేశాల్లో అంతంత మాత్రమే..
    వాలెంటైన్‌ డే అంటే సందేశాలు ఇచ్చిపుచ్చుకునే రోజు అని... కాలానుగుణంగా ఇది ప్రేమికుల రోజుగా మారింది.

    మనుషులే కాదు పక్షుల ప్రేమకు ఇదే రోజును ఎంపిక చేశారు. ఫిబ్రవరిలోనే పక్షులు ఎక్కువగా జంటలను వెతుకుతాయని అందుకే ఇదే రోజును ఎంపిక చేశారని విశ్లేషకుల అభిప్రాయం..

    గ్రీటింగ్‌ కార్డులు..
    St_Valentineవాలెంటైన్స్‌ రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. హృదయాకృతులు, పావురాలు, విల్లు, బాణం ధరించిన రెక్కలున్న క్యుపిడ్‌(గ్రీకుల ప్రేమ దేవత పేరు, మన్మథుడు) బొమ్మలు ఆధునిక కాలంలో వాలెంటైన్‌ చిహ్నాలుగా మారాయి. 19వ శతాబ్దం నుంచి, చేతితో రాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్‌ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది. గ్రేట్‌ బ్రిటన్‌లో పందొమ్మిదవ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికతకు నిదర్శనంగా పరిగణించేవారు. 

    అమెరికాలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్‌ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్‌ కార్డులుగా తయారవుతున్నాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌ వాలెంటైన్‌ కార్డులు పంపిణీ అవుతున్నట్లు .. గ్రీటింగ్‌ కార్డుల సంఘం అంచనాలు చెబుతున్నాయి. క్రిస్మస్‌ తరువాత కార్డులు ఎక్కువగా పంపిణీ చేసే రోజుగా వాలెంటైన్స్‌ డే గుర్తింపు పొందింది. 

    సృ్కతికి గుర్తుగా... 
    పురాతన రోమ్‌ నగరంలో పూజారిగా పని చేసే రోమ్‌ వాలెంటైన్‌ క్రీ.శ.269లో మతాచారాల కోసం బలికి గురయ్యాడు. అతడిని ఫ్లామినియాలో సమాధి చేశారు. రోమ్‌లోని సెయింట్‌ ప్రాక్సెడ్‌ చర్చిలో, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న వైట్‌ఫ్రియర్‌ స్ట్రీట్‌ కార్మెలైట్‌ చర్చిలో అతని పునరావశేషాలు చూడవచ్చు. క్రీ.శ.197 ప్రాంతంలో ఇంటెరమ్నా(ఆధునిక టెర్నీ) క్రైస్తవ మతపెద్ద అయిన టెర్నీ వాలెంటైన్‌ అరేలియన్‌ చక్రవర్తి మతోన్మాదానికి బయ్యాడు. అతడిని కూడా ఫ్లామినియాలోనే సమాధి చేశారు. అయితే అతని అంత్యక్రియలు రోమ్‌ వాలెంటైన్‌ను సమాధి చేసిన ప్రదేశంలో జరగలేదు. 

    కాథలిక్‌ విజ్ఞాన సర్వస్వంలో ఫిబ్రవరి 14కు సంబంధించిన మృతవీరుల జాబితాలో వాలెంటైన్‌ పేరుతో మూడో సెయింట్‌ ప్రస్తావన కూడా ఉంది. మూడో వ్యక్తి, అతని సహచరులతోపాటు ఆఫ్రికాలో మతాచారాల కోసం బలి ఇవ్వబడ్డాడు. వాస్తవానికి ప్రారంభ మధ్యయుగానికి చెందిన ఈ మృతవీరుల ఆత్మకథల్లో ఎవరికీ, ఎటువంటి ప్రేమ సంబంధమైన అంశాలతో సంబంధం లేదు.