Search This Blog

Chodavaramnet Followers

Tuesday 26 February 2013

BY-PASS SURGERY - MODERN TECHNIQUES - REMEDIES - DOCTORS ADVISE


బైపాస్ సర్జరీలో ఆధునిక పద్ధతులు


గత దశాబ్దకాలంగా గుండెజబ్బులు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. తద్వారా గుండెకు సంబంధించిన ప్రొసీజర్లు వేగవంతమయ్యాయి. వీటిలో ముఖ్యమైనది బైపాస్ పర్జరీ. నేడు ఇది ఎంతగా ఆధునీకరించబడింది, ఫలితాల శాతం ఎలా ఉంది వంటి విషయాలను వివరిస్తున్నారు ప్రముఖ కార్డియాక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ కృష్ణప్రసాద్.

ప్రస్తుతం ఆధునిక వైద్యవిధానంలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ఆపరేషన్ అనేది సాధారణంగా జరుగుతున్న శస్త్ర చికిత్స. బైపాస్ అంటే తెలుగులో ఉపమార్గం అని చెప్పవచ్చు. అంటే దారి సరిగ్గా లేనప్పుడు కొత్త దారి ఏర్పర్చడం. కరొనరీ ధమనులు మూసుకుపోయి గుండె కండరానికి రక్త సరఫరా జరగనప్పుడు సర్జన్ కొత్త దారి ఏర్పరచి రక్త సరఫరా సాఫీగా అయ్యేలా చేస్తాడు. సర్జరీ అయిన తర్వాత రోగి పూర్వం అనుభవించిన అనేక ప్రాణాంతక సమస్యల నుండి బయటపడవచ్చు.

అత్యధిక కేసుల్లో మంచి ఫలితాన్ని పొందడానికి బైపాస్ సర్జరీని సూచిస్తారు. సర్జరీ చేయాల్సి వస్తే వయస్సు అనేది అడ్డంకి కాదు. సర్జరీ పూర్తయిన తర్వాత పూర్వం కంటే మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. కఠిన నిబంధనలతో కూడిన జీవితం గడపనవసరం లేదు. కేవలం 6 నుంచి 8 వారాలు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి.

మిడ్‌కాబ్
రోగికి ఒక చోట మాత్రమే మూసుకుపోయి గుండెకు రక్త సరఫరా జరగనప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులైన యాంజియోప్లాస్టి, బార్‌స్టెంట్ వేయడానికి కుదరనప్పుడు లేదా ఇంతకు ముందు ప్రయత్నించి విఫలమైనప్పుడు మినిమల్లీ ఇన్‌వేసివ్ డైరెక్ట్ కరొనరీ బైపాస్(ఎంఐడిసిఎబి-మిడ్‌కాబ్) చాలా ఉపయోగం. ఆధునికంగా చేస్తున్నవాటిలో చెప్పుకోదగ్గది, తక్కువ కోతలతో చేసే బైపాస్ సర్జరీ ఇదే.

తక్కువ కోతలు
దీని వల్ల గుండె కండరం ఎక్కడ తిన్నదో సరిగ్గా అక్కడే చేరుకుని చికిత్స ప్రారంభించవచ్చు.
ఆఫ్‌పంప్ సిఎబిజి
ఈ విధానంలో శస్త్ర చికిత్సను హార్ట్‌లంగ్ మిషన్ సహాయం తీసుకోకుండా పూర్తి చేస్తారు. తక్కువ కోతల వల్ల గ్రాఫ్టింగ్ తక్కువ. అందవికారంగా ఉండదు. రోబోటిక్ అనే మరొక ఆధునిక ప్రొసీజర్ అతి తక్కువ కోతలతో చేసేది. చిన్న కోతలతో పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. సంప్రదాయబద్ధంగా చేసే బైపాస్ సర్జరీలో రోగికి గ్రాఫ్టింగ్ అనేక చోట్ల చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ కోసం సిపిబి సహాయం తీసుకుంటూ, ఈ గ్రాఫ్టింగ్ చేసే సమయంలో తాత్కాలికంగా గుండెను నిలిపివేస్తారు.

ఛాతీ ఎముక వద్ద చేసిన కోతలు, అవసరాన్ని బట్టి కరొనరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మరిన్ని కోతలు అవసరాన్ని బట్టి విధించాల్సి ఉంటుంది. వీటి ఫలితాలు మధ్యస్తంగా ఉండి ఒక మోస్తరు శస్త్ర చికిత్సాఘాతానికి కొద్దిపాటి వాపునకు రోగిని గురిచేస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది సిపిబి సర్కులేటరీ సపోర్ట్ లేకుండా చేసే కరొనరీ బైపాస్ గ్రాఫ్టింగ్. గత దశాబ్ద కాలంగా ఎంతో సురక్షితం అని నిరూపణ అయింది. ఈ సమయంలో కొట్టుకునే గుండెను యథాస్థానంలోనే ఉంచి, కరొనరీ ధమనులను స్థిరీకరించి అవసరమైన ప్రదేశంలో కృత్రిమ కార్డియాక్ స్టెబిలైజేషన్ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ సమయంలో గుండె నిర్విరామంగా కొట్టుకుంటూనే ఉంటుంది.

ఒపిసిఎబి
ఈ ఆధునిక విధానంలో ఉన్న మరికొన్ని ఉపయోగాలు ఆసుపత్రిలో తక్కువగా ఉండటం, రక్తం తక్కువ కోల్పోవడం, ఆసుపత్రి ఖర్చులు తక్కువ కావడం వంటివి కొన్ని చెప్పవచ్చు. తక్కువ కోతలతో చేసే ఈ శస్త్రచికిత్సను ముంజేతి వద్ద ఉన్న నరాన్ని తీసి ఈ సర్జరీని పూర్తి చేస్తున్నారు. పాత రోజుల్లో కాలి వద్ద నుండి తీసేవారు. ఇది డయాబెటిక్, అధిక బరువు కలిగిన వారిలో ఉపయోగం.

రెండవసారి చేసే బైపాస్ సర్జరీ
సంప్రదాయ విధానంలో రెండవసారి చేసే బైపాస్ సర్జరీ చాలా రిస్క్‌తో కూడి ఉంటుంది. ఈ సమయంలో రోగి గుండె విధి నిర్వర్తించడం నిస్తారంగా ఉంటుంది. దీనిలో రక్త సరఫరా ఆటంకం తొలగించడానికి, పాత శస్త్ర చికిత్సకు సంబంధించిన గ్రాఫ్టింగ్ సరిచేయడానికి చేసే కోతలు కఠినంగా ఉంటాయి. ఫలితంగా వ్యాధి ప్రబలితకు అనుసంధింపబడి ఉంటుంది. ఇందులో ఆధునిక ప్రక్రియ ద్వారా కోతలు తక్కువగా చేస్తారు. పూర్తిగా ఓపెన్ చేయకుండానే సర్జరీ చేసి వ్యాధి ప్రబలత, ప్రాణహాని తగ్గిస్తారు.

వాల్వ్ మరమ్మతు, మార్పిడి
గుండె కవాటం పుట్టుకతో దెబ్బ తిన్నవారు లేదా మధ్యలో సంక్రమించిన వారికి కార్డియాక్ శస్త్రచికిత్స నిపుణుడు అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. సిపిబి సపోర్ట్ దానికి అనుసంధానించవలసిన కృత్రిమ పరికరాలు, గుండె కవాటం తెరవడం వంటివి ప్రాధాన్యత వహిస్తాయి. చిన్నపిల్లల్లో అనేక రకాల గుండె జబ్బులు వస్తాయి.

ఉదాహరణకు బృహద్ధమనిని, పువున ధమనిని కలిపే గొట్టం గర్భస్థ పిండంలో ఉంటుంది. ఇది శిశువు భూమి మీద పడినప్పుడు మూసుకుపోతుంది. లేనట్లయితే ప్రత్యక్ష ధమని వాహికను వృక్షాంత దర్శిని సహాయంతో కొన్ని సర్జికల్ పరికరాలతో మూసి వేస్తారు.

డాక్టర్ ఎ.ఆర్. కృష్ణ ప్రసాద్ కన్సల్టెంట్ కార్డియాక్ థొరాసిక్ సర్జన్ సన్‌షైన్ హాస్పిటల్స్ ప్యారడైజ్ సమీపాన, పిజి రోడ్, సికింద్రాబాద్ ఫోన్: 9030011121