Search This Blog

Chodavaramnet Followers

Tuesday 26 February 2013

BEAUTICIAN RAJU SAYS BE CAREFUL OF USING COSMETICS AND AVOID DAILY USAGE OF COSMETICS FOR ARTIFICIAL BEAUTY



వినియోగంలో జాగ్రత్తలు

సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాల సంగతి పక్కన పెడితే.. వాటి వినియోగంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* రోజువారీ మేకప్ అలవాటును మానేసుకోవాలి. సందర్భాన్ని బట్టి అవసరమైనప్పుడే వినియోగించాలి.
* ఏదైనా కొత్త ఉత్పత్తిని ముందుగా మోచేతిపై కొంచెం రాసుకుని చూడాలి. ఎలాంటి అలర్జీ లేకపోతేనే దాన్ని వాడుకోవాలి.
* చాలా మంది కాలం చెల్లిన మేకప్ ఉత్పత్తులను వినియోగిస్తున్నార ని ఓ సర్వేలో తేలింది. ఒకే ఉత్పత్తిని ఎక్కువకాలం వాడటం కూ డా ఇందులో భాగమే. ఉదాహరణకు ఒకే లిప్‌స్టిక్‌ను ఏడాదికిపైగా వాడడం వల్ల అవి మధ్యలోనే కాలం చెల్లినా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఉత్పత్తులపై వినియోగతేదీలను తప్పక పాటించాలి.
* మేకప్ సామానును ఇతరులతో పంచుకోవద్దు. దీనివల్ల జబ్బులు సంక్రమించవచ్చు. రాత్రి వేళలో తప్పక మేకప్ తీసేయాలి
* మీరు వాడే ఉత్పత్తిపైన అందులో ఉండే రసాయనాల వివరాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ముప్పు తెచ్చే రసాయనాలు ఉన్న వాటికి ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలు. ముడిసరకుల వివరాలను పొందపరచని ఉత్పత్తులను వాడకపోవడమే అన్ని విధాలా మంచిది.
* వీలైనంత వరకూ హెర్బల్ ఉత్పత్తులనే ఉపయోగించాలి. 


ప్రత్యామ్నాయాలు చూడండి

కాస్మెటి క్స్ మంచివేనని చెప్పిన వారెవరూ లేరు. మరి అందాన్ని కాపాడుకోవడం ఎలా? అనుకుంటున్నారా? ప్రకృతి అందించే సహజ ఉత్పత్తులే దీనికి పరిష్కారం. ఉదాహరణకు గంధం ముఖానికి నిగారింపునిస్తుంది. పసుపు, చందనాలు చర్మానికి వన్నె తెస్తాయి. సున్నిపిండిని సబ్బులకు బదులు వాడుకోవచ్చు. నిమ్మరసం చుండ్రుకు పనిచేస్తుంది. కుంకుడుకాయ, శికాయలు సహజ షాంపూలు. క్యారట్, దోసకాయ, మెంతిపిండి, తేనె, వేపపుల్ల.. ఇలా ప్రకృతి మనకు అనేక సౌందర్య పోషకాలను అందించింది.