వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో ఒక స్పూను పాలు పొయ్యాలి.
ఇంగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.
నూనె పొరపాటున ఒలికిపోతే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనె త్వరగా పీల్చుకుంటుంది.
పసుపు నీళ్లతో కిచెన్‌ను శుభ్రం చేస్తే ఈగలు రావు.
కత్తిపీటకు ఉప్పు రాస్తే పదునుగా తయారవుతుంది.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే పై పెంకు త్వరగా వస్తుంది
బిస్కెట్ ప్యాకెట్‌ను బియ్యం డబ్బాలో పెడితే బిస్కెట్లు తొందరగా మెత్తబడవు.
క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వెయ్యాలి.