Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 14 September 2016

TO OVERCOME DRY SKIN PROBLEM USE BUTTER WITH BANANA ALSO WITH CARROT JUICE ETC



చర్మం పొడిగా మారి, నిర్జీవంగా తయారైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే వెన్న సాయంతో పొడి చర్మ సమస్య నుండి విజయవంతంగా బయట పడవచ్చు.

వెన్నలో ఫ్యాటీఆమ్లాలూ, విటమిన్‌ ‘ఎ’ సమృద్దిగా ఉండుట వలన చర్మానికి తేమ మరియు కాంతి వస్తుంది.

ఒక స్పూన్ వెన్న, ఒక స్పూన్ మీగడ కలిపి ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

ఒక స్పూన్ వెన్నను ఒక స్పూన్ అరటిపండు గుజ్జులో కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత కడిగితే ముఖం మీద ముడతలు మాయం అవుతాయి. అంతేకాక చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఒక స్పూన్ వెన్నకు చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత కడగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

అరస్పూన్ వెన్నలో రెండు స్పూన్ల ఉడికించిన క్యారట్ గుజ్జును కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

గుడ్డులోని తెల్ల సొననీ, అర స్పూన్ వెన్నని తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే గుడ్డులోని పోషకాలు చర్మానికి బిగుతునిస్తాయి. తేమతో కళకళలాడే చర్మాన్ని సొంతం చేస్తాయి.