Search This Blog

Chodavaramnet Followers

Friday 27 May 2016

MEMORY LOSS - FUNNY JOKE



జాజి శర్మగారిమతిమరపు !! 
.
"ఏమోయ్ ! జాజిశర్మా !! మతిమరపు ఓ ట్రిక్ చెప్పాను ఆ మధ్య ! బాగా పనిచేస్తోందా ? " అనడిగారు వింజమూరి వారు
" ఆ డాన్స్ ట్రిక్ కదా సార్ ! అబ్బే ! డాన్స్ చెయ్యలేక చస్తున్నాన్ సార్ !" అన్నాడు భవదీయుడు
" అయితే అది వదిలేయ్యి ! ఈ సారి మరో ట్రిక్ చెప్తాను ! శ్రద్ధగా విను ! అబ్బే అదేం తిండి ! ఆ ముద్దపప్పుకి ఆ కొత్తావకాయ మాడుపెట్టి రెండు ముద్దలు లాగించు !! ఇదిగో వీడికి రెండు గరిటెలు పప్పునూనె వడ్డించు" అని వదినగారికి ఆర్డర్ వేశారు.
నేను ఆయన చెప్పినట్లు కొత్తావకాయ, ముద్దపప్పు కాంబినేషన్కి వదినగారు వద్దన్న వినకుండా వడ్డించిన పప్పునూనె కలిపి ఆవురావురంటూ రెండేమిటి, పదిముద్దలు లాగించి, ఆపైన సాంబారు బిగించి, గడ్డపెరుగుతో భోజనం ముగించి హాలులోకి ఆయన వెనకాలే వచ్చాను.
"ఆ ! ఏమిటీ మాట్లాడుకుంటున్నాము ? మతిమరపు కదా !! దీనికి అమోఘమైన మందు ఉన్నదోయ్ ! చాలామందికి ఈ బాధ ఉన్నదే. నేను తీవ్రంగా ఆలోచించి ఇది కనిపెట్టాను. నువ్వు దీనికి బాగా ప్రచారం కల్పించాలి. అన్నట్లు నీ ఫేస్బుక్ సర్కిల్ ఎంత?
" సార్ ! మీలాగే సిక్సర్ కొట్టాను !! " అన్నాన్నేను.
" కోడ్లు గుడ్లు వద్దు ! ఎంత చెప్పు ! అంటే మాక్సిమమ్ కదా !! అంటే ఐదు వేలు కదా ! నువ్వు బాగా ప్రచారం చెయ్యాలి. మరి !"
"తప్పకుండా ! సార్ ! అంతే కాదు !! శ్రీ రాఘవానంద ముడుంబా వారి దయవల్ల మరో పదివేల మంది ఫాలోయింగ్ కూడా ఉన్నది " కాస్త ఎక్కువే అయినా ఆయన్ని ఇంప్రెస్ చేసి ఈ మతిమరపుకి ఆయన కనిపెట్టినదేదో కొట్టేయ్యాలని చెప్పేశాను.
" గుడ్ ! గుడ్ !! మరి ఈ మద్య నువ్వు మన రమణీయ లోగిలిలో పోస్టులు పెద్దగా పెట్టడం లేదు. కాస్త చూడు మరి దాని సంగతి " అన్నారు కళ్ళజోడులోంచి కాస్త గట్టి చూపుల్తోనే.
" పోస్టులకి తగిన బొమ్మలు దొరకటం లేదు " నసిగాను.
" బొమ్మలా ! నా టైంలైన్లో బోలెడున్నాయి "
" అంటే ఆ ముద్దుగుమ్మల బొమ్మలు కాదు సార్ ! కొంటె బొమ్మల బాపువి"
" అదేం ! పట్టించుకోవద్దులే !! పైగా నువ్వో మొడరేటరవి గా ! సరే ! ఈ తాంబూలం వేసుకో !! జాజికాయ, జాపత్రి, పచ్చివక్క పీటీ, కలకత్తా పత్తా ! ఇఖ లాగించు. దెబ్బకి తిన్న అన్నం జీర్ణం కావాలి " అంటూ పాందాన్ ముందుకి తోశారు.
తాంబుల సేవనం అయిన తరువాత " ఆ ! మతిమరపు ఈ మందు ట్రై చెయ్యి" అని నా దగ్గరకు వచ్చి చెవిలో బ్రహ్మోపదేశం చేసి , తన స్టైల్లో నవ్వేశారు. నేను నవ్వేశాను. ఇది మీకు చెబుతాను. మీరు బాగా ప్రచారం చెయ్యండి.
బ్రహ్మశ్రీ వింజమూరి వేంకట అప్పారావు గారి ఉపదేశం ఎట్టిదనిన .


. "మరేం లేదురా అబ్బీ ! అన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకోవడమే "