Search This Blog

Chodavaramnet Followers

Saturday, 23 April 2016

SRI LALITHA SAHASRANAMAM PRAYER IN TELUGU


లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.
శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || ౧ ||
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || ౨ ||
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || ౩ ||
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || ౪ ||
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || ౫ ||
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || ౬ ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || ౭ ||
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || ౯ ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || ౧౦ ||