Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 20 October 2015

SRI DURGA DEVI ALANKARAM INFORMATION IN TELUGU


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏనిమిదవ రోజు శ్రీ దుర్గా దేవి అవతారము 
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.