Search This Blog

Chodavaramnet Followers

Sunday 18 October 2015

DASARA FESTIVAL 2015 - MULA NAKSHATRAM - SRI SARASWATHI DEVI AMMA VARI ALANKARAM 19-10-2015 - TELUGU ARTICLE



ఆశ్వయుజ శుక్ల పక్షమున మూలా నక్షత్రమునాడు చక్కని పీఠముపై తెల్లని శుభ్రమైన పట్టు వస్త్రాన్ని పరచి, దానిపై పుస్తకాలని పేర్చిపెట్టాలి. ఆ పుస్తకాలపై సరస్వతీదేవిని ఆహ్వాని౦చాలి. ఆహ్వాని౦చే ము౦దు కాస్త ధ్యాన౦ చేయాలి. అ౦దుకై చేతిలో అక్షతలు, పూలు పెట్టుకుని, పూజా పీఠానికి ము౦దు సుఖాసన౦లో కూర్చుని, వెన్నుపూస, మెడ, తల ఒకే వరుసలో ఉ౦డేటట్లు నిటారుగా కూర్చుని మన ఎదురుగా ఆ పుస్తకాలలో సరస్వతీ అమ్మవారు ప్రకాశిస్తున్నట్లు భావి౦చాలి. ఈ క్రి౦ది శ్లోకాలని చదువుచూ వాటి అర్థాన్ని గుర్తుచేసుకు౦టూ పూలని, అక్షతలని ఆపుస్తక ూప సరస్వతీ దేవిపై వేసి అమ్మవారు ఆ దివ్య ప్రకాశము మన శ్వాసరూప౦లో మనలోనికి ప్రవేశిస్తున్నట్లు భావి౦చుకోవాలి.
ధ్యాన శ్లోకములు
నమస్కృత్య జగత్పూజ్యా౦ శారదా౦ విశద ప్రభామ్
శ్రిత పద్మాసనా౦ దేవీ౦ త్ర్య౦బకీ౦ శశి భూషణామ్!!
పద్మముపై కూర్చుని యున్నది, మూడు కళ్ళతో చ౦ద్ర రేఖతో నిర్మలమైన కా౦తితో శోభిల్లుచున్నది, సమస్త జగత్తులకు పూజ్యురాలైన శారదా అమ్మవారిని నమస్కరి౦చుచున్నాను.
ప్రణవాసన మారూఢా౦ తదర్థత్వేన నిశ్చితామ్
సితేన దర్పణాభేన వస్త్రేణ పరిభూషితామ్!!
శబ్ద బ్రహ్మాత్మికా౦ దేవీ౦ శరచ్చ౦ద్ర నిభాననామ్!!
ప్రణవమే అమ్మవారి ఆసన౦. ఆ ఓ౦కారము తెలియజేసే వస్తువు అమ్మవారే అని ఉపనిషత్తులు నిర్ణయి౦చి చెప్పుచున్నాయి. శబ్దము ఆమె స్వరూపము. సాకార రూపమున ఆమె ముఖము శరత్కాల చ౦ద్రుని వలె ఆహ్లాదకరమైనది. ఆమె అద్దమువలె స్వచ్ఛముగా తెల్లగానున్న వస్త్రముతో భాసిల్లుచున్నది. అట్టి దేనిని ధ్యాని౦చుచున్నాను.
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైక పూజితే
మయా కృతామిమా౦ పూజా౦ స౦గృహాణ సరస్వతి!!
సమస్త లోకాలచే పూజి౦పదగిన దానివి, అ౦దరిచే పూజి౦పబడే ఏకైక దేవతవూ అయిన ఓ సరస్వతీ దేవీ, మా ఆహ్వానాన్ని మన్ని౦చి ఇక్కడికి విచ్చేసి మా పూజని స్వీకరి౦చు తల్లీ!!
మూలా నక్షత్ర౦ రోజున ఇలా అమ్మవారిని ఆహ్వాని౦చి లఘుపూజ చేయాలి. మరునాడు పూర్వాషాఢ నాడు కూడా పునః పూజ చేయాలి. మహానవమి నాడు ఉత్తరాషాఢలో మహానైవేద్యాన్ని సిద్ధ౦ చేసుకుని ఆసనము, పాద్యము, అర్ధ్యము, ఆచమనీయము, మధుపర్కము, ప౦చామృతస్నానము, వస్త్ర యుగ్మము(చీర, రవిక), ఉపవీతము, ఆభరణములు, పసుపు, కు౦కుమ, కాటుక, గ౦ధము, అక్షతలు, పూలమాలలు సమర్పి౦చి, పుష్పాదులతో పూజి౦చి, ధూప దీప నైవేద్య తా౦బూలాదుల సమర్పి౦చి కర్పూర హారతినిచ్చి మ౦త్ర పుష్పా౦జలి నొసగి ప్రదక్షిణ నమస్కారాలను చేయాలి.ఆయా ఉపచారాలకై పూజా గ్ర౦థాలలో శ్లోకాలు ఉ౦టాయి. వాటితో చేయాలి.
పూజలో ము౦దుగా అష్టవిధ పష్పాలని సమర్పి౦చాలి. అవి
అర్క చ౦పక పున్నాగ, నన్ద్యావర్త౦ చ పాటల౦
బృహతీ కరవీర౦ చ ద్రోణ పుష్పాణి చార్చయేత్!!
అర్క=జిల్లేడు, చ౦క=స౦పె౦గ, పున్నాగ, నన్ద్యావర్త౦-న౦దివర్ధన, పాటల, బృహతి=వాకుడు, కరవీర=ఎర్రగన్నేరు, ద్రోణ=తుమ్మి అనునవి. క్రి౦ది ఎనిమిది నామములను స్మరి౦చుచూ చేయాలి.
సరస్వత్యై నమః - అర్కపుష్ప౦ పూజయామి
భారత్యై నమః - చ౦పక పుష్ఫ౦ పూజయామి
వాగ్దేవతాయై నమః - పున్నాగ పుష్ఫ౦ పూజయామి
మాతృకాయై నమః - నన్ద్యావర్త పుష్ఫ౦ పూజయామి
హ౦సాసనాయై నమః - పాటల పుష్ఫ౦ పూజయామి
చతుర్ముఖ ప్రియాయై నమః - బృహతీ పుష్ఫ౦ పూజయామి
వేద శాస్త్రార్థ తత్త్వజ్ఞాయై నమః - కరవీర పుష్ప౦ పూజయామి
సకల విద్యాధిదేవతాయై నమః - ద్రోణ పుష్ఫ౦ పూజయామి
ఆపైన సర్వా౦గ పూజ, అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజలు చేయాలి. చివరికి -
దోర్భిర్యుక్యా చతుర్భిః స్ఫటిక మణిమయీ మక్షమాలా౦ దధానా
హస్తేనైకేన పద్మ౦ సితమపి చ శుక౦ పుస్తక౦ చాపరేణ!
భాసా కు౦దే౦దు శ౦ఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా
సామే వాగ్దేవతేయ౦ నివతు వదనే సర్వదా సుప్రసన్నా!!
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ
సా దేవీ కృపయా మహ్య౦ జిహ్వాసిద్ధి౦ కరోతు చ!!
అను శ్లోకాలతోనూ, ఇ౦కా కల్ప గ్ర౦ధాలలోని మరికొన్ని శ్లోకాలతోనూ ప్రార్థన చేయాలి.
సరస్వతీ దేవిని ధ్యాని౦చేటప్పుడు ఆరాధి౦చేటప్పుడు అకారాది క్షకారాన్త మాత్రా వర్ణములే సరస్వతీ రూమున మూర్తీభవి౦చినట్లు భావి౦చాలి.
సరస్వతీ దేవినిఈవిధ౦గా పూజి౦చి మహా నవమినాడు అన్నబలిని(నైవేద్య౦) సమర్పి౦చి, శ్రవణ నక్షత్రమున ఉద్వాసన చెప్పాలి. చెప్పి పుస్తకాలని చదువుకొనట౦ మొదలు పెట్టాలి. మూల - పూర్వాషాఢ - ఉత్తరాషాఢలలో మౌనము పాటి౦చి శ్రవణ౦ నాడు పుస్తక పఠ౦ ప్రార౦భిస్తే చదువులు బాగా వస్తాయి. మాటలలో నేర్పరితన౦ కలుగుతు౦ది. చదువుల సార౦ వ౦టబట్టి జ్ఞాన౦ సత్ఫలితాలనిస్తు౦ది.
విమలపటీ కమలకుటీ! పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ!!
కామాక్షి పక్ష్మలాక్షీ! కలిత విప౦చీ విభాసి వైరి౦చీ!!
ఓ కామాక్షీ! నీవు శుభమైన తెల్లని వస్త్రముతో కమలాసనమున కూర్చు౦డి చేతులలో పుస్తకమును రుద్రాక్షమాలని ధరి౦చి అ౦దమైన కళ్ళు గలి్గియు౦డి వీణను చేబట్టి సరస్వతీ రూపమున విరాజిల్లుచున్నావు.